Telugu News Power

మహానాడు పసుపు పండుగగా విజయవంతం చేయాలి. -టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు, మంత్రి నిమ్మల పిలుపు.

మహానాడుకు సిద్ధమవుతున్న మంత్రి నిమ్మల

పాలకొల్లు: మే, 26 (తెలుగు న్యూస్ పవర్. కామ్). సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ పండగల్లా టిడిపి ఆవిర్భావ దినోత్సవం మహానాడు పసుపు పండుగ ఘనంగా నిర్వహించాలని, టిడిపి శ్రేణులకు పోలిట్ బ్యూరో సభ్యులు, స్థానిక ఎమ్మెల్యే,మంత్రి నిమ్మల రామానాయుడు మంగళవారం పిలుపునిచ్చారు. టిడిపి పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జాతీయ కార్యదర్శి, యువగళం నేత నారా లోకేష్ బాబు మంత్రి నిమ్మల మహానాడు జరిగే ప్రదేశాలను సర్వాంగ సుందరంగా పసుపుమయంగా తీర్చిదిద్దారు. ఈనెల 27, 28 న రెండు రోజులపాటు అంగరంగ వైభవంగా జరిగేలా నిమ్మల తనదైన శైలిలో ప్రణాళిక సిద్ధం చేశారు. గతంలో జరిగినట్టు నియోజకవర్గ స్థాయిలో కాక, వినూత్నంగా పార్టీ క్లస్టర్ స్థాయిలో తొలిసారి ఈ మహానాడు వేడుకలు నిర్వహిస్తున్నారు. పోడూరు మండలం క్వస్టర్-1 లోని ఏడు గ్రామాలకు కెనాల్ రోడ్ లో గల కవిటం ఖాళీ స్థలం లో మహానాడు ఏర్పాట్లు చేశారు. యలమంచిలి మండలం, క్లస్టర్-2 కు సంబంధించి18 గ్రామాలకు దొడ్డిపట్ల కళ్యాణమండపం, క్లస్టర్-3 లోని 14 గ్రామాలకు యలమంచిలి తమ్మినీడి నరసింహారావు ఎస్టేట్లో ఏర్పాటు చేశారు. పాలకొల్లు పట్టణంలోని క్లస్టర్-4, 1-16 వార్డుల వరకు రామచంద్ర గార్డెన్స్ లో, క్లస్టర్-5 లో ఉన్న 17 నుంచి 31 వార్డులు, టిడ్కో ఇళ్ల వరకు లయన్స్ కమ్యూనిటీ హాల్ లో వేదిక ఏర్పాటు చేశారు. కస్టర్-6 లో ఉన్న 7 గ్రామాలకు భగ్గేశ్వరంలో ఉన్న సూర్య తేజ ఫంక్షన్ హాల్ లో, చందపుర్రు రోడ్డులో గల ట్రిపుల్ ఎస్ కళ్యాణ మండపం లో 12 గ్రామాలకు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ ప్రాంతాలన్నీ పసుపు శోభతో అలరారుతున్నాయి. తెలుగుదేశం క్యాడర్ నూతనంగా జరుగుతున్న ఈ వేడుకలు విజయవంతం చేయటానికి ఉత్సాహంగా పరుగులు తీస్తున్నారు.