Skip to main content

Telugu News Power

ఘనంగా ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుక.

పాలకొల్లు: మే, 28 (తెలుగు న్యూస్ పవర్. కామ్) విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, రాష్ట్ర పూర్వ ముఖ్యమంత్రి, దివంగత నేత నందమూరి తారక రామారావు 103 జయంతి ఉత్సవాలు వాడవాడలా ఘనంగా జరిగాయి. పాలకొల్లు నియోజకవర్గ పరిధిలో మంత్రి నిమ్మల రామానాయుడు పిలుపుమేరకు, స్థానిక గాంధీ బొమ్మల సెంటర్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. పేద ప్రజల కోసం, మహిళల కోసం, బీసీ వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా, స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు, పట్టణ టిడిపి అధ్యక్షులు గండేటి వెంకటేశ్వరరావు, వాడపల్లి ధర్మకర్త పెండ్యాల భవాని, ధనాన్ని సూర్య ప్రకాష్, పొట్నూరి ఫౌండేషన్ శ్రీనివాస్, మల్లంపల్లి ఫకీర్ బాబు బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు కర్నేని నాయుడు, వరలక్ష్మి, మేడిశెట్టి కేశవ,ముప్పిరి సత్యనారాయణ, తదితర పలువురు టిడిపి నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.