భీమవరం: జూన్, 17( తెలుగు న్యూస్ పవర్ కామ్ )పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు,ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి జేష్టమాస జాతర మహోత్సవాలు ప్రారంభ సూచకంగా శ్రీ అమ్మవారిని బుధవారం నిల బెట్టారు. ఈ కార్యక్రమం ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో అర్చకులు, వేదపండితులు శ్రీ అమ్మవారి ఘటాలకు. విశేష పూజలు నిర్వహించారు. అనంతరం సంప్రదాయం అనుసరించి శ్రీ అమ్మవారి పుట్టింటి, మెట్టింటి వారు అల్లూరి, మెంటే వంశ్దస్తులచే మేళతాళాలు, డప్పు వాయిధ్యాలు మార్మోగుతుండగా, వైభవం గా ప్రధమ పూజలు ప్రారంభించారు.దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్, ఆలయ చైర్మన్ బొండాడ నాగ భూషణం, ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, ఉదీశి మీనాక్షి, అతికెల ఆంజనేయ ప్రసాద్, గుసిడి నాగ శిరీష, కారెంపూడి ఆదిలక్ష్మి, మిర్తిపాటి గుణేశ్వరరావు, మల్లువలస లక్ష్మి నిర్మల, గొంతెన రమణ,యండ సత్యవతి, ఇందుకూరి సుబ్రహ్మణ్య రాజు, పాపొలు ఏడుకొండలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
శ్రీ మావుళ్ళమ్మ వారి జాతర ప్రారంభం.
శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు