Telugu News Power

మత్స్యకారులకు రూ.3 కోట్లతో నైపుణ్య శిక్షణ భవనం శంకుస్థాపన.

యలమంచిలి: జూన్, 19( తెలుగు న్యూస్ పవర్. కామ్) వెనుకబడిన వర్గాల వారికి 34 శాతం రిజర్వేషన్ ఇచ్చి దేశంలో చరిత్ర సృష్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. స్థానిక కుందేరు గ్రామంలో మూడు కోట్ల రూపాయల నిధులతో నిర్మించనున్న మత్స్యకార నైపుణ్య శిక్షణ భవనానికి మంత్రి శుక్రవారం శంకుస్థాపన చేశారు. తెలుగుదేశం పార్టీ అంటే బీసీలని, పార్టీ ఎప్పటికీ వారికి అండగా నిలుస్తుంది అన్నారు. గత ముఖ్యమంత్రి జగన్ బీసీల రిజర్వేషన్ 24 శాతానికి తగ్గించి వేశారని ఆరోపించారు. ఇందువల్ల వారు వేలాది ఉద్యోగాలు కోల్పోయినట్టు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ వరదల్లో మత్స్యకారులను వెన్నంటి ఉండి ఆదుకున్నారని తెలిపారు. మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచడానికి వారిలోని నైపుణ్యాన్ని వెలికి తీయడానికి ముఖ్యమంత్రి ఈ శిక్షణ భవనానికి అంకురార్పణ చేశారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో, తహసిల్దార్ గ్రంధి పవన్ కుమార్, డి ఈ దుర్గా రామస్వామి, మండల అధ్యక్షురాలు వినుకొండ ధనలక్ష్మి రవికుమార్, మామిడి శెట్టి పెద్దిరాజు, ఆరమిల్లి రామ శ్రీనివాస్, చిట్టూరి ఆంజనేయులు, పీతల శ్రీనివాస్, మత్స్యకార ప్రముఖులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.