Telugu News Power

విద్యార్థుల భవిష్యత్తుకు యడ్ల గణేశ్వర రావు ఫౌండేషన్ వెలుగు బాట.

పాలకొల్లు: జూన్, 19( తెలుగు న్యూస్ పవర్. కామ్) వైసిపి పార్టీ సీనియర్ నాయకులు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ యడ్ల తాతాజీ కుటుంబం నిర్వహిస్తున్న యడ్ల గణేశ్వర రావు ఫౌండేషన్ మరో మానవీయ కార్యక్రమం చేపట్టి, శుక్రవారం పూర్తి చేసింది. యలమంచిలి మండలం అడవిపాలెం కు చెందిన బుంగ ప్రసాద్ ఇంటికి వెలుగులు ప్రసాదించింది. గ్రామ వైసిపి అధ్యక్షులు సిర్ర నాగరాజు, బుంగ జయరాజు స్థానిక బుంగ ప్రసాద్ కుటుంబ దయనీయ పరిస్థితి గురించి తాతాజీ దృష్టికి తీసుకువెళ్లారు. కడుపేదరికంతో జీవిస్తున్న ప్రసాద్ కుటుంబం ఇంటికి విద్యుత్ సౌకర్యం లేక చదువుకుంటున్న వారి పిల్లలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని వివరించారు. వెంటనే స్పందించిన తాతాజీ నేరుగా మీసేవ కేంద్రానికి వెళ్లి విద్యుత్ సౌకర్యం కల్పించడానికి అవసరమైన ప్రక్రియ తనే పూర్తి చేశారు. ఆ పేద ఇంటికి వెలుగులు రావడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గంటా నరేష్, చెన్ను విజయ్, పాలపర్తి కృపానాథ్, పాలపర్తి శ్రీను, రేలంగి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.