పాలకొల్లు: జూన్, 20( తెలుగు న్యూస్ పవర్. కామ్) పట్టణ పరిధిలో జరుగుతున్న కోట్లాది రూపాయల అభివృద్ధి పనులను శనివారం మంత్రి నిమ్మల రామానాయుడు సుడిగాలి పర్యటనలో పరిశీలించారు. గత ప్రభుత్వం అభివృద్ధిని పక్కనపెట్టి, అరాచక పాలన సాగించటం వల్ల ప్రగతి ఆగిపోయిందని మంత్రి నిమ్మల ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ రెండేళ్లలో 900 కోట్ల రూపాయలకు పైగా అభివృద్ధి పనులు చేపట్టినట్టు వెల్లడించారు. టిడ్కో ఇళ్ళు తమ హయాంలోనే నిర్మాణం జరిగిందని, కనీసం 30 శాతం నిధులు కూడా కేటాయించలేకపోయిందని ఆరోపించారు. తాము పూర్తిచేసిన ఇళ్లకు వైసీపీ రంగులు వేసుకుందని విమర్శించారు. టిడ్కో ఇల్లు తాకట్టు పెట్టి లబ్ధిదారులపై మూడున్నర లక్షల అప్పుల భారం పెట్టిందని విమర్శించారు. పూర్తయిన 2000 ఇళ్లతో పాటు, మిగిలినవి కూడా జులై నాటికి అందజేస్తామని తెలిపారు. వివిధ అభివృద్ధి పథకాలకు సంబంధించి పనులు జరుగుతున్న ప్రాంతంలో అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు. గడువులోపే పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో, ఈ ఈ తోట వెంకటనారాయణ, కమిషనర్ టీ కిరణ్ కుమార్, డి ఈ రాజకుమార్, డాక్టర్ యర్రా మాధురి, పెచ్చెట్టి బాబు, జీ.వి. అంగర వీరభద్ర కుమార్, బిట్ట లక్ష్మీనారాయణ, వల్లభు శ్రీనివాస్ పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులు పరిశీలించిన మంత్రి నిమ్మల.
టిక్కు ఇళ్ళ నిర్మాణం పరిశీలిస్తున్న మంత్రి నిమ్మల