Skip to main content

Telugu News Power

శ్రీ మావుళ్ళమ్మకు లక్షన్నర రూపాయలు బంగారం కానుక.

శ్రీ మావుళ్ళమ్మకు విరాళం ఇచ్చిన గుంటూరు, రంగిశెట్టి జగదీష్ దంపతులు

భీమవరం: జూన్, 21( తెలుగు న్యూస్ పవర్. కామ్)పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి సంపూర్ణ స్వర్ణమయ అలంకరణ కొరకు గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరు కి చెందిన రంగిశెట్టి జగదీష్ బాబు, సుభాషిణి దంపతులు సుమారు లక్ష ఏబై వేలు రూపాయలు విలువ గల పది గ్రాముల బంగారం విరాళంగా అందచేసారు.ఆలయ అర్చకులు వీరికి పూజలు,ఆశీర్వచనాలు నిర్వహించారు. దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం, ఆలయ చైర్మన్ బొండాడ నాగ భూషణం, ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్,ఉదీశి మీనాక్షి, కారెంపూడి ఆదిలక్ష్మి,గొంతెన రమణ, యండా సత్యవతి, అమ్మవారి చిత్రపటం, ప్రసాదం అందచేశారు.