Telugu News Power

తిరుమల శ్రీవారి జ్యేష్ఠాభిషేకం మహోత్సవం.

తిరుమల: జూన్, 27( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి
జ్యేష్ఠాభిషేకం తిరుమలలో జరిగే అత్యంత విశిష్టమైన ఉత్సవాల్లో ఒకటి.ఈ ఉత్సవాన్ని “అభిదేయక అభిషేకం” అని కూడా పిలుస్తారు.అభిదేయకం అంటే రక్షణ కవచం అని అర్థం.
గ్రీష్మతాపం తగ్గి, సమృద్ధిగా వర్షాలు కురవాలని సంకల్పంతో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు.
శ్రీమహావిష్ణువు కలియుగంలో వేంకటేశ్వర స్వామిగా అవతరించినప్పుడు తన దివ్యాయుధాలతో అవతరించారని పురాణాలు చెబుతున్నాయి.
స్వామివారి ఆయుధాల తేజస్సు, పదును, మహిమకు ప్రతీకగా సంవత్సరానికి ఒకసారి ఈ అభిషేకం నిర్వహిస్తారు.
ప్రతి సంవత్సరం జ్యేష్ఠమాసంలో, జ్యేష్ఠా నక్షత్ర సమయానికి ముగిసేలా మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి.
ఉత్సవాలు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామికి నిర్వహిస్తారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పరిపూర్ణ ఆశీస్సులతో భక్తులకు ఉభయదేవేరులతో అనుగ్రహ దర్శనం.