Telugu News Power

పెదగోపురం లో కృష్ణ పింగళి చతుర్థి పూజ.

కృష్ణ పింగళ చతుర్థి పూజలు నిర్వహిస్తున్న దృశ్యం

పాలకొల్లు: జులై, 3( తెలుగు న్యూస్ పవర్. కామ్)
పట్టణములో వేంచేసియున్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో కృష్ణపింగళ సంకటహర చతుర్థి, శ్రవణ నక్షత్రం సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతి హోమం పూజలు, భక్తిశ్రద్ధలతో శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి పూజలు శుక్రవారం జరిగాయి. లక్ష్మీ గణపతి హోమం, పూజలు అభిషేక పండితులు బమ్మిడిపాటి వెంకన్న , ప్రధాన అర్చకులు కిష్టప్ప ,ఆలయ ప్రధాన అర్చకులు అనిల్, అర్చకులు సుబ్బయ్య భక్తుల చేత పూజలు చేయించారు . ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు , ఆలయ చైర్మన్ మీసాల రామచంద్ర రావు సూపర్నెంట్ వాసు,ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.