Skip to main content

Telugu News Power

క్షీరా రామంలో లీలా కళ్యాణం.

లీలా కళ్యాణం నిర్వహిస్తున్న అర్చకులు

పాలకొల్లు: జూలై,12( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో మాస శివరాత్రి సందర్భంగా తెల్లవారుజాము నుంచి భక్తులు అభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు. రుద్ర హోమం నిర్వహించారు. రాత్రి స్వామివారి సన్నిధిలో గల కళ్యాణమండపం లో లీలా కళ్యాణం నిర్వహించారు. అభిషేక పండిట్ భమిడిపాటి వెంకన్న ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు ఈ కార్యక్రమాలు జరిపించారు. ఆలయ ఈవో ముచ్చర్ల శ్రీనివాసరావు వివేక్షణలో భక్తులు రుద్ర హోమం, లీలా కళ్యాణం పూజలు నిర్వహించారు.