Telugu News Power

శ్రీ మావుళ్ళమ్మ ఆలయంలో చండీ హోమం.

చండీ హోమం నిర్వహిస్తున్న రుత్వికులు

భీమవరం: జూలై, 14
( తెలుగు న్యూస్ పవర్. కామ్)
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం నందు అమావాస్య సందర్భంగా, మంగళవారం చండీహోమం జరిగింది. ఈ కార్యక్రమం ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ, వేదపండితులు నిర్వహించారు,90 మంది దంపతులు ఈ హోమంలో పాల్గొన్నారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధమహాలక్ష్మి నగేష్, ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్,ఉదిశి మీనాక్షి,అతికెల ఆంజనేయ ప్రసాద్, కారెంపూడి ఆదిలక్ష్మి, మిర్తిపాటి గున్నేశ్వరరావు,గొంతెన రమణ,యండా సత్యవతి,గుసిడి నాగ శిరీష,పాపొలు ఏడుకొండలు, విశేషం గా భక్తులు పాల్గొన్నారు.