Telugu News Power

శ్రీమావుళ్ళమ్మ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలు ప్రారంభం.

శ్రీ మావుళ్ళమ్మ జాతర ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే అంజిబాబు

భీమవరం : జూలై,20( తెలుగు న్యూస్ పవర్. కామ్) శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి అనుగ్రహమే పట్టణాభివృద్ధికి మూలమని, అమ్మవారి దయ సిరిసంపదలు వెల్లివిరుస్తాయని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. భీమవరంలో 3వ వార్డులో ప్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో శ్రీమావుళ్ళమ్మ అమ్మవారి 34వ వార్షిక జాతర మహోత్సవాన్ని, 38వ వార్డు లంకపేటలో అమ్మవారి 11వ వార్షిక జాతర మహోత్సవాన్ని, 35వ వార్డు సూర్యనారాయణ పురం యూత్ ఆధ్వర్యంలో అమ్మవారి జాతర మహోత్సవాన్ని ఎమ్మెల్యే అంజిబాబు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. వాడవాడలా అమ్మవార్ల జాతరను వారంవారం నిర్వహించడం శుభ పరిణామమని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. కార్యక్రమంలో ఏపిఐఐసి డైరెక్టర్ చెనమల్ల చంద్రశేఖర్, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ ఎండి షబీన బేగం, 3వ వార్డు ప్రెండ్స్ సర్కిల్ సభ్యులు యాతం శ్రీనివాస్ , బ్రాహ్మజి , కాపా అమర్ బాబు, సర్వే సత్యనారాయతన, మద్దాల బ్రహ్మాజీ, వీర రాఘవులు, ముగ్గళ్ళ నాని, 35వ వార్డు యూత్ సభ్యులు కొప్పినిడి బాబీ, దేవర కుమార్, వెంకన్న, సత్యనారాయణ, నౌడూరి ప్రసాదు, వై శ్రీను, వీరన్న, మైనం కార్తీక్, చంద్రశేఖర్, దేవర గోపి, 38వ వార్డు లంకపేట సభ్యులు యండ మావుళ్లు, యండ సత్యవతి, రాంబాబు, రమాదేవి, యండ అప్పల సూరి, కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు వీర మహిళలు తెలుగు మహిళలు తదితరులు పాల్గొన్నారు.