Skip to main content

Telugu News Power

విభిన్న ప్రతిభావంతులకు ఉద్యోగ కల్పనే లక్ష్యం: జిల్లా కలెక్టర్ నాగరాణి.

ఉద్యోగార్ధులకు సూచనలిస్తున్న కలెక్టర్ నాగరాణి

పాలకొల్లు: జూలై, 23( తెలుగు న్యూస్ పవర్. కామ్)పశ్చిమగోదావరి జిల్లా, పాలకొల్లు, దాసరి నారాయణరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా గురువారం జరిగింది. ఈ ప్రత్యేక జాబ్ మేళాలో కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. విభిన్న ప్రతిభావంతులైన యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసమే ఎదురు చూడకుండా, ప్రైవేట్ రంగంలోని అవకాశాలను కూడా అందిపుచ్చుకోవాలని ఇతవు పలికారు . జిల్లాలో విభిన్న ప్రతిభావంతుల కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని, తరచూ జాబ్ మేళాలు నిర్వహించాలని కంపెనీ ప్రతినిధులకు, ఈ సందర్భంగా, సూచించారు. ఈ జాబ్ మేళాకు 150 మంది యువత హాజరయ్యారు. వివిధ కంపెనీల ప్రతినిధులు, స్థానిక అధ్యాపకులు వివిధ ప్రాంతాల నుంచి ఉద్యోగార్ధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.