Skip to main content

Telugu News Power

విద్యాదాత గాంధీ భగవాన్ రాజుకు సత్కారం.

గాంధీ భగవాన్ రాజును సత్కరిస్తున్న దృశ్యం

పాలకొల్లు: జూలై, 24( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక పూలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధికి, గ్రామ ప్రముఖులు, గాంధీ మెగా ఫౌండేషన్ అధ్యక్షులు, ఏఎంసీ మాజీ చైర్మన్, రాష్ట్ర ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు చేస్తున్న సేవలను పలువురు వ్యక్తులు కొనియాడారు. మేక పేరెంట్స్ డే ఉత్సవాల్లో భాగంగా విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న ప్రముఖులను సత్కరించే కార్యక్రమంలో భాగంగా గాంధీ భగవాన్ రోజును శుక్రవారం ఘనంగా పాఠశాల వద్ద సత్కరించారు. పాఠశాల అభివృద్ధికి తన వంతు కృషి కొనసాగిస్తానని గాంధీ భగవాన్ రాజు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో, ప్రధానోపాధ్యాయులు, జి టి కుమార్, శ్రీహరి రాజు, కార్యదర్శి పాల శ్రీనివాస్, గూడూరి లక్ష్మణ్, ఉనికిలి నాగేశ్వరరావు, తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.