పాలకొల్లు: జూలై, 24( తెలుగు న్యూస్ పవర్. కామ్) కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వరుసగా 2 ఏడాది కూడా క్రమం తప్పకుండా తల్లికి వందనం నిధులు వారి ఖాతాల్లోకి జమ చేసినట్టు స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మెగా పేరెంట్స్ డే కార్యక్రమం సందర్భంగా స్థానిక వీఆర్ఏ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో జరిగిన పేరెంట్స్ డే లో ముఖ్యఅతిథిగా మంత్రి శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉన్నా, వారందరికీ 13 వేల రూపాయల చొప్పున నిధులు జమ చేసినట్టు వెల్లడించారు. గతంలో ఉన్న గొడ్డలి పార్టీ విద్యార్థులకు ఇస్తామన్న అమ్మ ఒడి కేవలం లో ఒక్కరికి మాత్రమే ఇచ్చి ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన ఈ పథకం వల్ల మధ్యలో బడి మానివేసే వారి సంఖ్య గణనీయంగా తగ్గినట్టు వెల్లడించారు. ఎంతమంది పిల్లలు ఉన్నప్పటికీ, తల్లిదండ్రులు ధైర్యంగా తమ పిల్లలను బడికి పంపటానికి ఈ పథకం భరోసా ఇస్తుందన్నారు. స్థానిక నియోజకవర్గంలో 27 లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరినట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 67, 47,110 మంది విద్యార్థులకు రూ.10,120 కోట్ల నిధులు వీక్షించటం పట్ల కూటమి ప్రభుత్వానికి విద్యారంగం పట్ల ఉన్న లక్ష్యానికి నిదర్శనం అన్నారు. గత జగన్ ప్రభుత్వం ఒక్క ఉపాధ్యాయ పోస్ట్ కూడా భర్తీ చేయనప్పటికీ, మెగా డీఎస్సీ ద్వారా ఎంపికైన 16 వేలపు పైగా ఉపాధ్యాయులను, వారి ప్రతిభను అవమాన పరుస్తూ, పొత్తులకి ఆరోపణలు చేస్తుందని, తీవ్రంగా గర్హించారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ పోలవరం, రాజధాని, పరిశ్రమల ఏర్పాటు ద్వారా రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెంపొందించడానికి, సంపద సృష్టికి తీవ్రంగా కృషి చేస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రధాని మోడీ అండదండలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రగతికి నిరంతరం పాటుపడుతున్నారని తెలిపారు. పని చేసే ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు, ప్రధానోపాధ్యాయులు వై ప్రభాకర్ శాస్త్రి, ఎం ఈ ఓ గంగాధర్ శర్మ, బోనం చినబాబు, ఉన్నమట్ల కపర్తి, వల్లభు శ్రీనివాస్, దీప్తి అప్పారావు, పెనుమాక రామ్మోహనరావు, కామేశ్వరరావు, వెంకన్న, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పట్టణ ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు
తల్లికి వందనం పధకం లో నియోజకవర్గాని కి రూ. 35 కోట్లు. -మంత్రి నిమ్మల వెల్లడి.
మంత్రి నిమ్మలకు బి.ఆర్.ఎం.వి ఉన్నతపాఠశాల విద్యార్థుల ఘన స్వాగతం