భీమవరం: జూలై, 25( తెలుగు న్యూస్ పవర్. కామ్)
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం ఆలయ ప్రాంగణం లో తొలిఏకాదశి సందర్భంగా లలిత, విష్ణు సహస్రనామ పారాయణం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి, దేవస్థానం వారు 800 మంది మహిళా భక్తులను ఆహ్వానించారు. దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, ఉదీశి మీనాక్షి, అతికెల ఆంజనేయ ప్రసాద్, గుసిడి నాగ శిరీష, కారెంపూడి ఆదిలక్ష్మి, అరసవల్లి బాల సుబ్రహ్మణ్యం, మిర్తిపాటి గున్నేశ్వరరావు,మల్లువలస లక్ష్మి నిర్మల, గొంతిన రమణ, యండ సత్యవతి, పాపొలు ఏడుకొండలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులకి ప్రసాదం వితరణ, అన్న ప్రసాదం కార్యక్రమం నిర్వహించారు. వందల సంఖ్యలో భక్తులు భక్తిశ్రద్ధలతో పారాయణ కార్యక్రమం లో పాల్గొన్నారు.
శ్రీ మావుళ్ళమ్మ ఆలయంలో ఘనంగా తొలి ఏకాదశి పర్వదినం. సహస్రనామ పారాయణంలో పాల్గొన్న 800 మంది భక్తులు.
పారాయణం చేస్తున్న మహిళా భక్తులు