భీమవరం: జూలై, 26( తెలుగు న్యూస్ పవర్. కామ్) కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా భీమవరంలో పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ యువమోర్చా (బీజేవైఎం) ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి నిర్వహించిన విజయోత్సవ వేడుకల్లో స్థానిక ఎంపీ, కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ పాల్గొన్నారు. మాతృభూమి రక్షణలో ప్రాణాలర్పించిన అమరవీరులకు ఘన నివాళులర్పించారు. దేశానికి సేవలందించిన మాజీ సైనికులను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు.
కాగడాలతో కార్గిల్ దివాస్ విజయోత్సవ ర్యాలీలో మంత్రి కలసి నడిచారు. అమర జవానుల స్ఫూర్తితో నవభారత నిర్మాణానికి పునరంకితమవుదామని కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు బిజెపి నాయకులు పాల్గొన్నారు.
కార్గిల్ విజయ్ దివస్ లో కేంద్రమంత్రి భూపతి రాజు.
కార్గిల్ విజయ్ దివస్ కాగడాలతో ర్యాలీ