Skip to main content

Telugu News Power

భారత్–రొమేనియా సంబంధాలల్లో మేలి మలుపు.

మహాత్మా గాంధీ కి నివాళులర్పిస్తున్న రొమేనియా అధ్యక్షులు,నికుషోర్ డాన్‌, భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్మ్.
రొమేనియాలో ఉన్న భారతీయులతో రాష్ట్రపతి ఆత్మీయ కలయిక

రొమేనియా పర్యటనలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.

బుఖారెస్ట్:జూలై, 26 తెలుగు న్యూస్ పవర్. కామ్) భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రొమేనియా పర్యటన సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు నికుషోర్ డాన్‌తో ద్వైపాక్షిక సమావేశం స్పెయిన్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, విజ్ఞాన–సాంకేతిక రంగాలు, విద్య, క్రీడలు, సాంస్కృతిక సహకారం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.
రొమేనియా యూరోపియన్ యూనియన్‌లో భారతదేశానికి కీలక భాగస్వామి అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. భారత్–యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్ టీ ఏ) అమల్లోకి వస్తే ఇరు దేశాల పరిశ్రమలు, నైపుణ్య వృత్తి నిపుణులకు కొత్త అవకాశాలు లభిస్తాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ పర్యటన సందర్భంగా విజ్ఞాన–సాంకేతికం, క్రీడలు, భారత అధ్యయనాలకు సంబంధించిన మూడు కీలక ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. ఈ ఒప్పందాలు ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేస్తాయని అధికారులు తెలిపారు.
రొమేనియా పార్లమెంట్ నాయకులతో కూడా రాష్ట్రపతి ముర్ము సమావేశమై పార్లమెంటరీ సహకారాన్ని మరింత విస్తరించాలని పిలుపునిచ్చారు.భారత్–
రొమేనియా వ్యాపార వేదికలో పాల్గొని పెట్టుబడులు, వాణిజ్య భాగస్వామ్యంపై చర్చించారు.
రొమేనియా రాజధాని బుఖారెస్ట్‌లోని “టూమ్ ఆఫ్ ది అన్‌నోన్ సోల్జర్” (అమరవీరుల స్మారక స్థూపం) వద్ద ముర్ము పుష్పగుచ్ఛం ఉంచి అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అక్కడ నిర్వహించిన గౌరవ వందనాన్ని స్వీకరించి, వీర జవాన్ల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమం భారత్–రొమేనియా మధ్య పరస్పర గౌరవానికి ప్రతీకగా నిలిచింది.రాష్ట్రపతి ముర్ము బుఖారెస్ట్‌లో నివసిస్తున్న భారతీయ ప్రవాసులను
కలుసుకుని వారితో ఆత్మీయంగా ముచ్చటించారు. విదేశాల్లో ఉంటూనే భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిస్తూ, రొమేనియా అభివృద్ధిలోనూ తమ వంతు పాత్ర పోషిస్తున్న భారతీయులను ఆమె అభినందించారు. భారత్–రొమేనియా ప్రజల మధ్య స్నేహబంధాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
జానపద నృత్యాలకు ముగ్ధురాలైన రాష్ట్రపతి
రొమేనియా కళాకారులు ప్రదర్శించిన సంప్రదాయ జానపద నృత్యాలు, సంగీత కార్యక్రమాలను రాష్ట్రపతి ఆసక్తిగా వీక్షించారు. రంగురంగుల సంప్రదాయ దుస్తుల్లో కళాకారులు అందించిన ప్రదర్శనలను ఆమె ప్రశంసించారు. భారతీయ మరియు రొమేనియా సంస్కృతుల మధ్య ఉన్న సారూప్యతలను ప్రస్తావిస్తూ, సాంస్కృతిక మార్పిడి ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు.మోల్డోవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా దేశాల పర్యటనను విజయవంతంగా ముగించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం భారత్‌కు తిరిగి చేరుకున్నారు.

రొమేనియా జానపద నృత్యం