Skip to main content

Telugu News Power

సార్వా కు సాగు నీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి. -కలెక్టర్ నాగరాణి ఆదేశాలు.

సార్వా సాగు పై సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ.


భీమవరం: జూలై, 30( తెలుగు న్యూస్ పవర్. కామ్) సార్వా లో రైతులకు సాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. చివరి ఎకరా వరకు సాగునీరు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రతి రైతు తప్పనిసరిగా క్రాప్ ఇన్సూరెన్స్ చేయించుకునేలా విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన ప్రత్యేక నీటిపారుదల సలహా మండలి సమావేశంలో ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణతో పాటు ఇరిగేషన్, వ్యవసాయ శాఖ అధికారులు, నీటి సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.