Skip to main content

Telugu News Power

పెట్రోలు డీలర్ల కమిషన్ పెంపుకు మంత్రి హామీ.

కేంద్ర మంత్రి కి వినతిపత్రం సమర్పిస్తున్న ఎంపీ ప్రభాకర్ రెడ్డి

న్యూఢిల్లీ: జులై, 31( తెలుగు న్యూస్ పవర్. కామ్) కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కలిశారు.దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ రిటైల్ అవుట్‌లెట్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
డీలర్ల మార్జిన్‌లో 2017 నుంచి ఎలాంటి పెంపు లేకపోవడంతో పెరుగుతున్న నిర్వహణ వ్యయాలు, ఉద్యోగుల వేతనాలు, విద్యుత్ ఛార్జీలు, బ్యాంకు వడ్డీలు, ఇతర చట్టబద్ధ ఖర్చుల కారణంగా డీలర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి దృష్టికి తెచ్చారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పెట్రోలు, డీజిల్ రిటైల్ విక్రయ ధరలో 5 శాతం డీలర్ మార్జిన్ అమలు చేయాలని, అలాగే అపూర్వ చంద్ర కమిటీ సిఫార్సులను అమలు చేసి ప్రతి ఏడాది మార్జిన్‌ను పునఃసమీక్షించే విధానాన్ని తీసుకురావాలని కేంద్ర మంత్రిని కోరాను.
డీలర్ల వినతిపత్రం, సమగ్ర నివేదికను ఆయనకు అందజేశాను. ఈ అంశంపై మంత్రి హర్దీప్ సింగ్ పూరీ సానుకూలంగా స్పందించి సమస్యను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.