పాలకొల్లు: ఆగస్టు,3( తెలుగు న్యూస్ పవర్. కామ్)పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో 11 రోజులు పాటు జరిగే జలాభిషేకం పూజలు సోమవారం శ్రీ స్వామివారి కి వరుణ్ జపం పూజలు, జలాభిషేకం నిమిత్తం రుద్రాభిషేకం మహన్యస పూజలు అభిషేక పండితు లు బమ్మిడిపాటివెంకన్న, మద్దూరు సూరిబాబు, ఆలయ ప్రధాన అర్చకుడు అనిల్ కుమార్, ఆలయ ప్రధాన అర్చకుడు కృష్ణప్ప, తదిర అర్చకులతో అభిషేకం పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు, ఆలయ చైర్మన్ మీసాల రామచంద్రరావు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
క్షీరారామం లో కొనసాగుతున్న జలాభిషేక విశేష పూజలు.
జలాభిషేక పూజలు నిర్వహిస్తున్న రిత్వికులు