పాలకొల్లు: ఆగస్టు,6( తెలుగు న్యూస్ పవర్. కామ్) పాలకొల్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు, తెలుగుదేశం నాయకులు కోడి విజయభాస్కర్ దంపతులు గురువారం స్థానిక పంచారామ క్షేత్రం లో వేంచేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి, అన్నపూర్ణ అమ్మవారి దర్శించుకున్నారు. గత కొంతకాలంగా హైదరాబాదులో వైదచికిత్స తీసుకుని, ఆరోగ్యం మెరుగవటంతో హైదరాబాద్ నుంచి బయలుదేరి నేరుగా శ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దర్శనం చేసుకున్నట్టు తెలిపారు. అర్చకులు క్రిష్టప్ప వీరికి ఆశీర్వచన పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న ఏఎంసీ చైర్మన్ విజయ భాస్కర్.