పాలకొల్లు: ఆగస్టు,9( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆక్వా రైతు సంఘం, రాష్ట్ర అధ్యక్షులు, గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు ఆధ్వర్యంలో, ఈనెల 11న ఆక్వారైతు మహాసభ నిర్వహించాలని నిర్ణయించినట్టు, స్థానిక జై భారత్ శ్రీ క్షీరా రామ ఆక్వారైతు సంఘం, అధ్యక్షులు బోణం వెంకట నర్సయ్య ( చినబాబు) ఆదివారం వెల్లడించారు. ఎంతో కాలంగా, అపరిష్కృతంగా ఉన్న, ఆక్వా రైతులు ఎదురుచూస్తున్న విద్యుత్ సబ్సిడీ ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించిందని వెల్లడించారు. ఆక్వా రైతులు చేపట్టిన ఎన్నో ఉద్యమాల ద్వారా రైతుల కల సాకారం అయిందని వివరించారు. గత వైసిపి ప్రభుత్వం విద్యుత్ సబ్సిడీ ఇచ్చినప్పటికీ, వివక్ష చూపిందన్నారు. ఆక్వా జోన్, నాన్-ఆక్వా జోన్ గా విభజించి కొంతమందికి మాత్రమే ప్రయోజనం కలిగించిందని ఆరోపించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం, ఆక్వా రైతు సంఘం, రాష్ట్ర అధ్యక్షులు, గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు ప్రతినిధి బృందంతో పలుమార్లు చర్చించి అందరికీ సబ్సిడీ వర్తించే నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఆక్వా రైతులు అందరికీ విద్యుత్ యూనిట్ ధర రూ. 1.50 కు, అది కూడా జూన్ నుంచి బకాయిలతో సహా రైతులకు అమలులోకి వస్తుందని వివరించారు. విద్యుత్ సమస్య పరిష్కరించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ, అపరిష్కృతంగా ఉన్న రైతుల డిమాండ్లు ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్ళటానికి రైతు మహాసభ ఉద్దేశాన్ని రైతులకు వెల్లడించారు. ఈ మహా సభకు, వ్యవసాయ శాఖామాత్యులు, అచ్చెమ్ నాయుడు, జిల్లా ఇన్చార్జి మంత్రి, విద్యుత్ శాఖామాత్యులు, గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారని తెలిపారు. భారీగా ఆక్వా రై ఈ సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు. స్థానిక సంఘ కార్యదర్శి, పెనుమత్స సత్యనారాయణ రాజు మాట్లాడుతూ, ప్రభుత్వ విద్యుత్ సబ్సిడీ వల్ల అన ంగా 16 వేల మంది ఆకుకూర ఎత్తులు ప్రయోజనం పొందుతారని తెలిపారు. రాష్ట్ర కమిటీ సభ్యులు సజ్జ వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ, జిల్లాలో సబ్సిడీ కోసం అదనంగా అర్హులైన 4 వేల మంది రైతులు మత్స్యశాఖ అభివృద్ధి అధికారి (ఎఫ్ డి ఓ)కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ పత్రికా సమావేశంలో కూటమి ప్రభుత్వానికి రైతు సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.
ఆక్వా రైతు మహాసభకు పాలకొల్లు తరలి రావాలి. -రాష్ట్ర సంఘం పిలుపు ఈ నెల 11న జరిగే సభకు మంత్రులు, ఎమ్మెల్యేలు రాక.
పత్రికా సమావేశంలో ఆక్వా రైతు సంఘం నాయకులు.