Skip to main content

Telugu News Power

శ్రీ మావుళ్ళమ్మ ఆలయంలో చండీ హోమం.

శ్రీ మావుళ్ళమ్మ ఆలయంలో చండీ హోమం
చండీ హోమం కార్యక్రమానికి హాజరైన భక్తులు

భీమవరం: ఆగస్టు,12( తెలుగు న్యూస్ పవర్. కామ్)పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం నందు అమావాస్య సందర్భంగా ఆలయ అర్చకులు వేదపండితులు చండీహోమం కార్యక్రమం నిర్వహించారు, పుణ్యదంపతులు 80 మంది భక్తిశ్రద్ధలతో హోమ ద్రవ్యాలు సమర్పించి పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్,ఆలయ ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, పాపొలు ఏడుకొండలు, పలువురు భక్తులు పాల్గొన్నారు.