యలమంచిలి:ఆగస్టు,19
(తెలుగు న్యూస్ పవర్. కామ్) మండలం తహసీల్దార్ గ్రంధి వెంకట పవన్ కుమార్ ” ఉత్తమ తహశీల్దార్ అవార్డును స్వాతంత్ర దినోత్సవం నాడు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి నుంచి అందుకున్న సందర్బంగా వారిని దుస్సాలువ, పూలమాల తో వైసిపి నాయకులు బుధవారం వారి చాంబర్లో సన్మానించారు. ఈ సందర్భంగా పవన్ కుమార్ సేవలను వారు కొనియాడారు. లంక గ్రామాల్లో వరదల వంటి విపత్కర పరిస్థితుల్లో పవన్ కుమార్ ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవలు అందించారని కొనియాడారు. అలాగే 22ఏ బాధితులకు ప్రేమ జాలి,కరుణ, దయతో సత్వరమే పరిష్కరిస్తారని కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ పథకాల అమలులో జిల్లాలోని సమర్థవంతంగా పనిచేసే తాసిల్దార్ లో పవన్ కుమార్ ఒకరని గుర్తు చేశారు. ఆయన సమర్థతకు మెచ్చి అప్పటి భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సమర్థవంతంగా పని చేసి, యలమంచిలి మండలంలో అందరికీ తలలో నాలుకలా ఉండి ఏ సమస్యనైనా సత్వరమే పరిష్కరించగల ఓ మంచి అధికారిగా పేరు తెచ్చుకున్నారన్నారు. మండల అధ్యక్షురాలు ఇనుకొండ ధనలక్ష్మి రవి కుమార్,, వైసీపీ మండల అధ్యక్షులు ఉచ్చుల స్టాలిన్, వైస్-ఎం. పి. పి. గొల్లపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీ రావూరి వెంకటరమణ బుజ్జి, పాలంకి శ్రీను,మానుకొండ సోమరాజు, మల్లుల బుజ్జి ,ఇలపకుర్తి పండు, గుర్రాల వెంకటరావు,చివటపు నాగేశ్వర రావు, మోకా నరసింహారావు, జవదాల సువర్ణ రాజు, సిర్రా నాగరాజు, కళ్యాణం గంగాధర్ రావు, వీరా ఉమశంకర్, గుబ్బల వాసు, పోలుకొండ వెంకట్, రావూరి శ్రీనివాస్, వర్ధనపు వివేక్, కుక్కల బాలచ్చందర్, కందికట్ల చిట్టిబాబు, చింద్రిపు. గణపతి,దుద్దే. ప్రభాకరరావు, యన్నబాత్తుల సుదీర్,తెన్నేటి చిన్న,మల్లుల నారాయణమూర్తి,చెరుకూరి వెంకటేశ్వర రావు,గుబ్బల రాజశేఖర్,తదితరులు ఈ ఘన సత్కార కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాశీల్దార్ పవన్ కు వైసిపి సత్కారం.
ఎంపీపీ ఇనుకొండ ధనలక్ష్మి ఆధ్వర్యంలో తాసిల్దార్ పవన్ కుమార్ ను ఘనంగా సత్కరించిన వైసీపీ నాయకులు.