
అంతర్వేది: ఆగస్టు,19( తెలుగు న్యూస్ పవర్. కామ్)
నవ నారసింహ క్షేత్రాలలో ఒకటిగా పేరుగాంచిన అంతర్వేది స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో స్వామి వారి జన్మ నక్షత్రం, స్వాతి నక్షత్రం, స్వామివారికి ప్రీతికరమైన బుధవారం రోజున స్వామివారి ఆలయంలో ఉదయం అష్టోత్తర శతకలశాభిషేకం, అనంతరం స్వామి వారికి నిత్యం జరిగే సుదర్శన నారసింహ హోమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పలువురు భక్తులు 9 బుధవారాలు 9 ప్రదక్షిణలు చేసి స్వామివారి అంతరాలయ దర్శనం ఉచితంగా దర్శించుకున్నారు.
దీక్ష 9 బుధవారాలు పూర్తి అయిన భక్తులు స్వామివారి సుదర్శన హోమంలో పాల్గొని పూర్ణాహుతి సమర్పించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించారు.
దీక్ష సమయంలో కోరిన కోరికలు నెరవేరిన భక్తులు స్వామివారికి మెక్కులు చెల్లించుకున్నారు.
ఆలయ అసిస్టెంట్ కమిషనర్ తిరుమల నాగ వరప్రసాద్ ప్రదక్షిణ దీక్ష చేసిన భక్తులకు ఉచితంగా అంతరాలయ దర్శనం కల్పించి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పర్యవేక్షించారు.