పాలకొల్లు: ఆగస్టు, 22( తెలుగు న్యూస్ పవర్. కామ్)పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి, నిత్యాన్నదాన ట్రస్ట్ కు శనివారం, రూ. లక్ష విరాళం సమర్పించారు. యర్రంశెట్టి పద్మారావు, యర్రంశెట్టి అనిల్ కుమార్, లక్ష్మీ సాయి చంద్రిక, వారి కుటుంబ సభ్యులు శాశ్వత నిత్య అన్నదానం ట్రస్టుకు విరాళంగా అందజేశారు. వీరికి దేవస్థానం తరుపున శేష వస్త్రం ఆలయ చైర్మన్ మీసాల రామచంద్ర రావు, స్వామి వారు, అమ్మవార్ల చిత్రపటం, ప్రసాదం ఆలయ కార్య నిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు అందజేసి సత్కరించారు. ఆలయ ప్రధాన అర్చకులు అనిల్, కిష్టప్ప లు దాతలకు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేసారు.
క్షీరా రామ నిత్యాన్న దాన పధకానికి రూ. లక్ష విరాళం.
నిత్యాన్నదాన పధకానికి విరాళం ఇచ్చిన భక్తులను సత్కరిస్తున్న చైర్మన్ రాము, ఈ ఓ శ్రీనివాసరావు.