
పాలకొల్లు: ఆగస్టు,23(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి ముఖ్య పోరాటాల ద్వారానే పరిష్కారం లభిస్తుందని రాష్ట్ర ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు పేర్కొన్నారు. అక్వా రైతులను సంఘటిత పరచడం కోసం భగవాన్ రాజు, రాష్ట్ర అధ్యక్షుని హోదాలో విస్తృత పర్యటనలు చేస్తున్నారు. ఈ సందర్భంగా భగవాన్ రాజు నెల్లూరు జిల్లాలో పర్యటించారు. నెల్లూరు ఆక్వా రైతుల సంఘంతో ఆదివారం భగవాన్ రాజు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సమిష్టి ఉద్యమాల ఫలితమే ప్రభుత్వం ఇస్తున్న విద్యుత్ సబ్సిడీ, నాన్ ఆక్వా జోన్ సమస్య పరిష్కారమైందని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆక్వా రైతులందరినీ కలుపుకుని వెళుతూ,రాష్ట్ర వ్యాప్తంగా ఆక్వా రైతు సంఘాన్ని బలపరచడానికి కృషి చేస్తానన్నారు. ఈ సమావేశంలో సత్తిబాబు రాజు, డాక్టర్ రామలింగరాజు, ఎం శ్రీనివాసరావు, శ్రీకాంత్, మస్తాన్ రావు, నెల్లూరు జిల్లా ఆక్వా రైతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.