హైదరాబాద్: ఆగస్టు,23
( తెలుగు న్యూస్ పవర్. కామ్) మద్యం రవాణా కుంభకోణం కేసులో ఆదివారం కీలక పరిణామం చోటు చేసుకుంది.మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును స్థానిక కొండాపూర్‌లోని ఆయన ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఈడీ అధికారులు – మద్యం రవాణా టెండర్లలో అక్రమాలు, నగదు లావాదేవీలపై దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు నిందితులను ఈడీ అరెస్టు చేసింది. కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్‌కుమార్, ఏపీ బెవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, రాజ్ కసిరెడ్డి అరెస్టయిన వారిలో ఉన్నారు. టెండర్లలో సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్‌ను వినియోగించినట్లు ఈడీ దృష్టికి వచ్చింది. కేసులో హవాలా లావాదేవీలపైనా దర్యాప్తు ముమ్మరం చేసిన ఈడీ తాజాగా ఈ చర్యకు ఉపక్రమించింది. ఇన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలో విచారించి వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా, కారుమూరి మాట్లాడుతూ, తన అరెస్టు అక్రముని, ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని వాపోయారు.
మద్యం రవాణా కుంభకోణం కేసులో కీలక పరిణామం. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు.
ఈ డి కార్యాలయం వద్ద కారుమూరి