Skip to main content

Telugu News Power

రసాయన శాస్త్రంలో రాణిస్తున్న కబీర్ చిల్లార్‌. ఐఐటీ బొంబాయి విద్యార్థికి అంతర్జాతీయ కెమిస్ట్రీ ఒలింపియాడ్‌లో స్వర్ణ పతకం!

గెలిచిన పథకాలతో కబీర్ చిల్లార్

జనరల్ డెస్క్: ఆగస్టు, 25 ( తెలుగు న్యూస్ పవర్. కామ్)
​ఉజ్బెకిస్థాన్‌లో నిర్వహించిన ప్రతిష్టాత్మక అంతర్జాతీయ కెమిస్ట్రీ ఒలింపియాడ్ (ఐసీహెచ్ఒ) 2026లో భారత విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి దేశానికి పేరుప్రతిష్టలు తెచ్చారు. ఈ పోటీల్లో పాల్గొన్న నలుగురు భారతీయ విద్యార్థుల బృందం ఏకంగా నాలుగు స్వర్ణ పతకాలు సాధించగా, అందులో ఐఐటీ బొంబాయిలో సీఎస్ఈ ( సి ఎస్ ఈ ) అభ్యసిస్తున్న కబీర్ చిల్లార్ ఒకరు.
​కబీర్ సాధించిన విశేష విజయాలు:
​ఐ సీ హెచ్ హ్ ఒ 2026, ఉజ్బెకిస్థాన్‌లో జరిగిన అంతర్జాతీయ కెమిస్ట్రీ ఒలింపియాడ్‌లో భారత్ తరఫున గోల్డ్ మెడల్ సాధించి గ్లోబల్ వేదికపై మెరిశారు.
​జె ఈ ఈ మెయిన్ 2026, జాతీయ స్థాయిలో జేఈఈ మెయిన్ 2026లో 300/300 పర్‌ఫెక్ట్ స్కోర్‌తో (100 పర్సంటైల్) అఖిల భారత మొదటి ర్యాంక్ (ఎఐఆర్ 1) కైవసం చేసుకున్నారు.
​జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026లో 360 మార్కులకు గాను 329 మార్కులు సాధించి, ఆల్ ఇండియా 2వ ర్యాంక్ (ఎఐ ఆర్ 2) కైవసం చేసుకున్నారు. మొదటి ర్యాంకర్ శుభమ్ కుమార్ కంటే ఈయన కేవలం ఒకే ఒక్క మార్కు వెనుకబడటం గమనార్హం.
​ప్రస్తుతం కబీర్ చిల్లార్ దేశంలోనే అత్యంత ఆదరణ పొందిన ఐఐటీ బొంబాయి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సీఎస్ఈ ) విభాగంలో బి.టెక్ చదువుతున్నారు. జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల నుండి అంతర్జాతీయ ఒలింపియాడ్ వరకు ప్రతి పోటీలోనూ అగ్రస్థానంలో నిలుస్తూ కబీర్ జన్ జి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.