Skip to main content

Telugu News Power

పవన్ ను కూటమి సీఎం అభ్యర్థిగా ప్రకటించాలి. వీర బలిజ శంఖారావం సభలో తీర్మానం.

వీర బలిజ శంఖారావంలో పాల్గొన్న ప్రతినిధులు

తిరుపతి: ఆగస్టు,31( తెలుగు తెలుగు న్యూస్ పవర్. కామ్) తిరుపతిలో వీర బలిజ పునర్జీవన శంఖారావం సభ సోమవారం ఘనంగా జరిగింది. ఈ సభలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కూటమి వచ్చే ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ను ప్రకటించాలని తీర్మానించారు. బలిజలకు కనీసం 15 అసెంబ్లీ సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. బలిజ భవనాలు నిర్మించాలని కోరారు. బలిజ, కాపు వర్గాలు ఇతర సామాజిక వర్గాలను కలుపుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ సభలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన బలిజ నాయకులు పాల్గొన్నారు.