Skip to main content

Telugu News Power

యూత్ హాస్టల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వర్మకు సంస్కార భారతి ఘన సన్మానం.

డాక్టర్ వర్మ ను సత్కరిస్తున్న స్వర్ణభారతి కార్యవర్గం

పాలకొల్లు: సెప్టెంబర్,10( తెలుగు న్యూస్ పవర్. కామ్) అంతర్జాతీయ యూత్ హాస్టల్స్ అసోసియేషన్, రాష్ట్ర శాఖ అధ్యక్షులుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎంపికైన డాక్టర్ కే ఎస్ పీ ఎన్ వర్మ ను సంస్కార భారతి జిల్లా శాఖ ఘనంగా సత్కరించింది. స్థానిక క్షత్రియ సంక్షేమ పరిషత్ కళ్యాణ మండపంలో గురువారం జరిగిన కార్యవర్గ సమావేశంలో డాక్టర్ వర్మకు అభినందన సభ జరిగింది. ఈ సందర్భంగా, అధ్యక్షులు చేగొండి వీవీ సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ, భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించి, విభిన్న జాతులు,వివిధ సంస్కృతుల మధ్య సుహృద్భావ వాతావరణం సృష్టించి దేశ సమైక్యతకు కృషి చేస్తున్న, యూత్ హాస్టల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వంటి ప్రతిష్టాత్మక, రాష్ట్ర శాఖకు పట్టణానికి చెందిన, సేవా తత్పరులు డాక్టర్ వర్మ ఎంపిక కావటం గర్వకారణం అన్నారు. సంస్కార భారతి కోశాధికారి యర్రంశెట్టి వెంకటరత్నం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత డాక్టర్ వర్మ మాట్లాడుతూ, ప్రపంచంలో అందరికీ, తక్కువ ఖర్చుతో, సురక్షితమైన, పరిశుభ్రమైన వసతిని కల్పించటం యూత్ హాస్టల్స్ ముఖ్య ఉద్దేశం అని తెలిపారు. స్వీయ సహాయం యూత్ హాస్టల్స్ వారి యొక్క ముఖ్య ఉద్దేశం ద్వారా ఎవరి పనులు వారే చేసుకోవటాన్ని ప్రోత్సహిస్తుందన్నారు. సామాజిక, బాధ్యత క్రమశిక్షణతో సాటి పర్యాటకులను గౌరవిస్తూ, వారికి హాస్టల్స్ వద్ద ప్రశాంత వాతావరణన్ని కలుగజేస్తుందన్నారు. పర్యాటకులు మధ్య పరస్పర నమ్మకంతో భద్రత కల్పిస్తుంది అన్నారు. యూత్ హాస్టల్స్ పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ నిషేధం వంటి అంశాల ద్వారా ప్రకృతిని ప్రేమించే ప్రోత్సాహాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. దేశ విదేశాల్లో పర్యటనలకు యూత్ హాస్టల్స్ సభ్యత్వం సహకరిస్తుందని వివరించారు. భారతీయ సంస్కృతి విశిష్టతను తెలుసుకుని యువత అఖండ భారత్ నిర్మాణంలో పాలు పంచుకునేందుకు కృషి చేస్తానని వర్మ స్పష్టం చేశారు. తణుకు జరిగిన ఘన సన్మానానికి వర్మ కృతజ్ఞతలు తెలిపారు. సంస్కార భారతి కార్యదర్శులు, చక్రావధానుల రెడ్డప్ప దవేజీ, అల్లూరి ఫౌండేషన్ అధ్యక్షులు, బాబు శ్రీ,, ప్రధాన కార్యదర్శి రాంజీ, పోకల వెంకన్న, కలిదిండి వెంకటపతి వర్మ, చెల్లుబోయిన రాము, గంటా వెంకటేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.