Skip to main content

Telugu News Power

శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి స్వర్ణ వస్త్రంకు గ్రా. 6.400 ల బంగారం సమర్పణ.

దాత భోగి ఆంజయ్య, తిరుపతమ్మ దంపతులను సత్కరిస్తున్న దృశ్యం
అమ్మ వారి హుండీ లెక్కింపు దృశ్యం

భీమవరం:సెప్టెంబర్, 10,(తెలుగు న్యూస్ పవర్. కామ్)
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి సంపూర్ణ స్వర్ణ వస్త్రం ప్రాజెక్ట్ కి మంగళగిరి కి చెందిన భోగి అంజియ్య, తిరుపతమ్మ దంపతులు 6.400 గ్రాముల బంగారం
విరాళంగా సమర్పించారు. వీరికి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు, ఆశీర్వచనాలు నిర్వహించారు ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం శేషవస్త్రం ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, అతికెల ఆంజనేయ ప్రసాద్, మిర్తిపాటి గున్నేశ్వరరావు, ఇందుకూరి సుబ్రమణ్యం రాజు, అమ్మవారి చిత్రపటం, ప్రసాదం అందచేసినారని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్, గురువారం తెలిపారు.

సంపూర్ణ స్వర్ణ మయం ప్రాజెక్ట్ హుండీ.

శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం సంపూర్ణ స్వర్ణ మయం ప్రాజెక్ట్ కోసం ఏర్పాటు చేసిన హుండీ దేవదాయ ధర్మదాయ శాఖ ఆదేశాలు మేరకు, దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్, దేవదాయ శాఖ భీమవరం తనిఖీదారు పి. ఎస్.సాయికుమారి పర్యవేక్షణలో హుండీ బుధవారం తెరిచి లెక్కించగా రూ.3,02,696 ల నగదు, బంగారం గ్రా. 16.700 లు భక్తులు సమర్పించారు. ఈ కార్యక్రమం లో దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్, చైర్మన్ బొండాడ నాగ భూషణం ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, ఉదిశి మీనాక్షి, అతికెల ఆంజనేయ ప్రసాద్ పాపోలు ఏడుకొండలు, స్వర్ణ వస్త్రం ప్రాజెక్ట్ సభ్యులు గోంట్ల వెంకట నారాయణ, కాగిత వెంకట రమణ, భక్తులు పాల్గొన్నారు