భీమవరం/ నరసాపురం: సెప్టెంబర్,12( తెలుగు న్యూస్ పవర్. కామ్)
శ్రీ జైన్ జ్యువల్ పార్క్ నందు సుమారు 20 సంవత్సరాలనుండి పని చేస్తున్న పాలకోడేరు మండలం, గొల్లలకోడేరు గ్రామానికి చెందిన షేక్ లాల్ సాహెబ్ అను వ్యక్తి సదరు జ్యువలరీ షాప్ నందు దఫధఫలుగా సుమారు 405 గ్రాముల బంగారు ఆభరణములను దొంగిలించాడు. షాపు యజమాని రాజేంద్ర కుమార్ జైన్ ఇచ్చిన పిర్యాదు పై ఈ నెల 10న కేసు నమోదు చేసారు. ఈ కేసు తీవ్రతను బట్టి నరసాపురం టౌన్ సి. ఐ ఆకుల రఘు గారు దర్యాప్తు చేయడం జరుగుతుంది.
ఈ కేసు ను ప్రతిష్టాత్మకముగా తీసుకొని, ముద్దాయిని పట్టుకొనుటకు ఉన్నత అధికారులు అయిన పశ్చిమగోదావరి జిల్లా ఎస్స్పీ
అద్నాన్ నయీం అష్మి ఐపిఎస్ ఆదేశాలు , నరసాపురం డీ ఎస్ పీ మేక సుధాకర రావు సూచనల మేరకు నరసాపురం పట్టణ సీఐ ఆకుల రఘు తన సిబ్బంధి తో వెంటనే వివిధ రకాల ఆధారాలు సేకరించి, తప్పించుకు తిరుగుతున్న ముద్దాయిని పట్టుకొనుటకు అన్నీ రకాల ప్రయత్నాలు చేసి వారికి వచ్చిన సమాచారం మేరకు ముద్దాయి షేక్ లాల్ సాహెబ్, తండ్రి సాయి బాబు, వయస్సు 35, కాలవగట్టు, గొల్లలకోడేరు గ్రామం, పాలకోడేరు మండలం, అనునతనిని ఎంతో చాకచక్యం గా అతని ఇంటి వద్ద మాటు వేసి పట్టుకుని అతనిని తన ఇంటివద్దనే అరెస్టు చేసి అతని నేర ఒప్పుదల స్టేట్మెంట్ ప్రకారం తాను సుమారు రెండు సంవత్సరాల నుండి ఫోన్ లోని “ఫెయిర్ప్లే ” అప్ లో బెట్టింగ్ ఆడి అప్పులు అయిపోవడం వల్ల, ఎవరకి అనుమానం రాకుండా తన పనిచేసే షాప్ లోనే దొంగతనం చేసితన ఇంట్లో దాచిన బంగారపు అరవంకీ – 53 గ్రామ్స్ మారియు బంగారు గాజులు (6)- 69 గ్రాములు ని అక్కడే స్వాధీన పర్చుకుని, స్వర్ణ కాంప్లెక్స్ భీమవరం లో రెండు వేరు వేరు షాప్ లలో పెట్టిన బంగారపు వడ్డాణం- 195 గ్రాములు, నాలుగు పేటల బంగారపు చంద్రహారం- 88 గ్రాములు మొత్తం 405 గ్రాముల రూ. 52.65 లక్షల విలువ గల బంగారు ఆభరణాలు నుస్వాధీనం చేసుకొన్నారు.
పై కేసును నమోదు చేసిన 12 గంటల వ్యవధి లోనే ఛేదించుటలో విశేష ప్రతిభ చూపించిన అధికారులు సీఐ ఆకుల రఘు, ఎస్.ఐ. పి. ప్రేమరాజు, ఎస్. ఐ. ఎస్ .ఎన్ . ముత్యాలరావు, సిబ్బంధి హెచ్ సి కె వేణు గోపాలరావు, పీసీ ఎన్ కె రాజేష్ లను జిల్లా ఎస్స్పీ శ్రీ అద్నాన్ నయీం అస్మి, నరసాపురం డిఎస్పి మేక సుధాకర రావు అభినందించారు. రివార్డుల కొరకు సిఫారసు చేసారు.
బంగారపు వ్యాపారం చేసే యజమానులు అందరూ తమ వద్ద ఎంత నమ్మకంగా పని చేస్తున్న, ఎన్ని సంవత్సరాల నుండి పని చేస్తున్న తమ వద్ద పని చేసే గుమస్తాలు, సేల్స్ మ్యాన్ లు, మ్యానేజర్ లు వంటి వారి ప్రవర్తన పట్ల, అలవాట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ప్రతిరోజూ తమ వస్తువులు అన్నీ ఉన్నాయో లేదో సరిచూసుకోవాలని సూచించారు. ఏదైనా నష్టం జరిగే అవకాశాన్ని ముందుగానే పసిగట్టి పోలీస్ వారికి తెలియపరచడం వలన నష్ట తీవ్రత తక్కువగా ఉంటుందని తెలియజేశారు.
బంగారు ఆభరణములను దొంగతనం కేసులో ముద్దాయి అరెస్టు. రూ. 52.65 లక్షల సొత్తు స్వాధీనం.
స్వాధీనం చేసుకున్న సారీ సొత్తు