Skip to main content

Telugu News Power

రిసార్ట్స్ ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకిరామ్.

ది పార్టీ పాలెం రిట్రీట్ రిసార్ట్స్ వద్ద జి ఎమ్మెల్యే కొత్తపల్లి జానకిరామ్
రిసార్ట్స్ వద్ద ఏర్పాటు చేసిన గ్రామీణ నేపథ్య దృశ్యం

మొగల్తూరు: సెప్టెంబర్, 21( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక పేరుపాలెం బీచ్ సమీపంలో ది పాలెం రిట్రీట్ రిసార్ట్స్ ను మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకిరామ్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు సౌకర్యాలు కల్పించటానికి ఈ రిసార్ట్స్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. పర్యాటకులకు ఉత్సాహం, ఉల్లాసం కలిగించే విధంగా రిసార్ట్స్ ఏర్పాటు చేసిన వారిని అభినందించారు. ఇక్కడ గ్రామీణ ప్రాంత వాతావరణంలో ఉండే వివిధ కళాకృతులను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు