పుష్కరాలకు హామ్ నుంచి రూ.44 కోట్ల నిధులు మంజూరు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ కు మంత్రి నిమ్మల కృతజ్ఞతలు.
పాలకొల్లు: సెప్టెంబర్,25( తెలుగు న్యూస్ పవర్. కామ్) గత ఐదేళ్లుగా పాలకొల్లు నియోజకవర్గం కోల్పోయిన అభివృద్ధిని భర్తీ చేసే ఉద్దేశంతో నిధులు మంజూరు చేస్తున్నట్టు, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం సమావేశ మందిరంలో జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడారు. పుష్కరాలకు సంబంధించి రూ.44 కోట్ల హామ్ నిధులు మంజూరైనట్టు వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, పట్టణా గురించి శాఖ మంత్రి నారాయణ కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. పాలకులు నియోజకవర్గంలో 13 పుష్కర ఘాట్లు ఉన్నాయని తెలిపారు. వీటి అభివృద్ధి కొరకు రూ.14 కోట్ల నిధులు వెచ్చించనున్నట్టు తెలిపారు. ఈ పనులకు సంబంధించి పరిపాలన సంబంధమైన టెండర్ల ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది అన్నారు. పట్టణంలో ప్రతిష్టాత్మకమైన ఎన్టీఆర్ బొండాడ కళాక్షేత్రం, కుళాయి చెరువు ట్యాంక్ బండ్ ఏర్పాటు, అబ్దుల్ కలాం హెల్త్ పార్క్, చంద్రబాబు నాయుడు ఉద్యానవనం, 27వ అంటూ బరియల్ గ్రౌండ్ పనులు సకాలంలో సకలలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. నాణ్యత ప్రమాణాలు పాటించాలని కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ దొడ్డ కిరణ్ కుమార్, ఇంజనీర్ రాజకుమార్, ఆయా శాఖల అధికారులు, రాష్ట్ర టిడిపి నాయకులు పెచ్చెట్టి బాబు, పట్టణ అధ్యక్షులు గండేటి వెంకటేశ్వరరావు, జక్కంపూడి కుమార్, రియా,ధనాన్ని సూర్య ప్రకాష్, వి. గోపి, ఏం. రాంప్రసాద్, ముప్పిరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.