Skip to main content

Telugu News Power

పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ కార్యాలయం భీమవరం లో ప్రారంభం.

జిల్లా పరిషత్ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే అంజిబాబు
జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరిస్తున్న కలెక్టర్ నాగరాణి

భీమవరం: సెప్టెంబర్, 25 (తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ కార్యాలయం శుక్రవారం భీమవరంలో ప్రారంభమైంది. ఇకనుంచి జిల్లా పరిషత్ కార్యదర్శి కలాపాలు భీమవరం నుంచి కొనసాగుతాయి. కొత్త జిల్లాలు ఏర్పడినప్పటికీ, జిల్లా పరిషత్ అవిభక్త ఉమ్మడి జిల్లా కేంద్రం ఏలూరులోనే ఉంది. స్థానిక సంస్థల పదవీకాలం గత బుధవారంతో ముగిసింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. ఈ సందర్భంగా పరిపాలనా సౌలభ్యం కొరకు అనివార్యంగా జిల్లా కేంద్రాలకు జిల్లా పరిషత్ కార్యాలయాలు తరలించారు. భీమవరం పంచాయతీ రాజ్ శాఖ కార్యాలయంలో జిల్లా పరిషత్ కార్యాలయానికి తాత్కాలిక వసతి ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి 30 మంది సిబ్బందితో ఈ కార్యాలయం పనిచేస్తుంది. జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారిగా, కలెక్టర్ నాగరాణి బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయ భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు, ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, ఏఎంసీ చైర్మన్ కలిదిండి సుజాత,జుత్తిగ నాగరాజు గంటా త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు.