Skip to main content

Telugu News Power

కూటమి నాయకుల చే అంగన్వాడీ టీచర్లకు సత్కారం.

అంగన్వాడీ టీచర్లను సత్కరించిన కూటమి నాయకులు

యలమంచిలి: సెప్టెంబర్, 28
(తెలుగు న్యూస్ పవర్. కామ్) భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం పురస్కరించుకుని ఈనెల 25 నుంచి వచ్చేనెల, 7 వరకు అంగన్వాడి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అంగన్వాడి విద్యార్థుల తల్లులకు, గర్భిణీ స్త్రీలకు ఇస్తున్న పోషకాహారం, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా, అంగన్వాడీ టీచర్లకు కూటమి నాయకులు స్థానిక నెంబర్ వన్ పాఠశాల అంగన్వాడీ కేంద్రం వద్ద సోమవారం సత్కార కార్యక్రమం నిర్వహించారు. అంగన్వాడి టీచర్లు ముత్యాల సీతా మహాలక్ష్మి,
దివి లక్ష్మి,
ఇనుకొండ రమాదేవి,
తిరుపతి జ్యోతి,
దొంగ రజిని,
చీకటపల్లి సువర్ణ కుమారి, చేసిన సేవలకు గుర్తింపుగా ఈ సత్కారం జరిగింది. ఈ కార్యక్రమంలో, కూటమి నాయకులు గ్రామ టీడీపీ అధ్యక్షులు,తాళ్లూరి సంతోష్ చందు,
గ్రామ జనసేన అధ్యక్షులు కాసా నాగరాజు,
టీడీపీ నాయకులు,ఆకుల యేసు,బొప్పన సురేష్,
కొత్తపల్లి వెంకటేశ్వర రావు,
కడలి విజయ కుమార్,
బీజేపీ గ్రామ అధ్యక్షులు,బర్రె రాందాస్,అంగన్వాడీ సూపర్వైజర్,ఎం. నాగ పద్మావతి పాల్గొన్నారు.