Skip to main content

Telugu News Power

బలమైన భావి భారతానికి అంగన్వాడీల కృషి. అంగన్వాడీ టీచర్లకు సత్కారం.

సత్కారం అందుకున్న అంగన్వాడీ టీచర్లు
అంగన్వాడి టీచర్ల సత్కార సభలో మాట్లాడుతున్న పద్మ వర్మ

పాలకొల్లు:సెప్టెంబర్,29
(తెలుగు న్యూస్ పవర్. కామ్) దేశవ్యాప్తంగా జరుగుతున్న “అంగన్ మిలన్ సేవ కార్యక్రమం”లో భాగంగా అంగన్వాడి ఉపాధ్యాయులు, ఆయాలను, ఆశా కార్యకర్తల సేవలను కొనియాడారు. స్థానిక మెప్మా కార్యాలయంలో మంగళవారం, అంగన్వాడీల అభినందన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, తల్లులు గర్భవతులుగా ఉన్నప్పుడు పోషకాహారాన్ని తీసుకోవడానికి, గర్భిణీలుగా ఉన్నప్పుడు పాటించవలసిన జాగ్రత్తల గురించి కాబోయే తల్లులకు వివరించడం, అంగన్వాడీలు చేరిన బాలలకు పౌష్టికాహారం అందజేయడం, వారిని బలమైన పౌరులుగా తీర్చిదిద్దడానికి వారు చేస్తున్న కృషిని వక్తలు ప్రశంసించారు. ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో, బిజెపి పట్టణ అధ్యక్షులు కొల్లి కొండ ప్రసాద్, రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి ఉన్నమట్ల కపర్తి, మహిళా మోర్చా నాయకురాలు అల్లూరి పద్మ వర్మ, పోడూరు మండల ఇంచార్జ్ జక్కంపూడి కుమార్, గవర పవన్ నాయుడు, నాలం బాబి, మల్లవోలు సురేష్, ఏరుకొండ దుర్గాప్రసాద్, గోపాలకృష్ణంరాజు, లక్ష్మీనారాయణ, అంగన్వాడి సూపర్వైజర్లు కృష్ణ వేణి, ఇందిర పాల్గొన్నారు.