Skip to main content

Telugu News Power

విద్యార్థులకు ఉచిత ఏకరూప దుస్తుల పంపిణీ.

స్థానిక లయన్స్ క్లబ్ ఉచిత దుస్తుల పంపిణీ

పాలకొల్లు: అక్టోబర్,1( తెలుగు న్యూస్ పవర్. కామ్)
స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాలలో చేరిన తొలి ఏడాది విద్యార్థులకు స్థానిక లయన్స్ క్లబ్, ఆధ్వర్యంలో ఉచిత ఏకరూప దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంల్లో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె. రత్న మాణిక్యం మాట్లాడుతూ, విద్యార్థుల విద్యాభివృద్ధితో పాటు వారి అవసరాలను గుర్తించి సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా సహకారం అందిస్తున్న లయన్స్ కమ్యూనిటీ క్లబ్ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు.
లయన్స్ క్లబ్ అధ్యక్షులు అందే భాను ప్రకాష్, సెక్రటరీ బాసిన దుర్గారావు, ట్రెజరర్ దేవత వెంకట్రావు, సభ్యులు లక్ష్మి నారాయణ, జయ భారత్ రెడ్డి, ఎన్. సీతారామారావు తదితరులు పాల్గొని ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఉచిత యూనిఫామ్‌లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ, విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని తమ వంతు సహాయ సహకారాలను అందించడం ఎంతో సంతృప్తినిస్తుందని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ టి. కృష్ణ, ఐక్యూఎసి కోఆర్డినేటర్ డాక్టర్ బి వెంకటస్వామి, అకడమిక్ కోఆర్డినేటర్ జి సుమలత, జెకెసి కోఆర్డినేటర్ కే శామ్యూల్, స్టూడెంట్ కౌన్సిల్ కన్వీనర్ డాక్టర్ వి డి వి విజయలక్ష్మి తదితర అధ్యాప, అధ్యాపకేతర సిబ్బంది, లయన్స్ క్లబ్ సభ్యులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.