అమలాపురం ఆర్డీఓకు నిధుల బదిలీకి ఆదేశాలు.
నర్సాపురం:అక్టోబర్, 1
(తెలుగు న్యూస్ పవర్. కామ్) కోనసీమవాసుల దశాబ్దాల కల, కోటిపల్లి-నరసాపూర్ రైల్వే లైన్ నిర్మాణం. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం ముఖ్యమైన ప్రకటన చేసింది. ప్రాజెక్టు నిర్మాణానికి భారతీయ రైల్వేలకు చెల్లించాల్సిన రాష్ట్ర ప్రభుత్వ వాటా కు సంభందించి రూ.100 కోట్లు నిధులకు మంజూరు ఇచ్చింది.
కోటిపల్లి-నరసాపూర్ రైల్వే లైన్ ప్రాజెక్టు మొత్తం వ్యయంలో 25 శాతం వాటాను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేందుకు రైల్వే తో ఒప్పందం చేసుకుంది. జగన్ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టుకు ఒక్క రూపాయి కూడా చెలించ లేదని అప్పట్లో విమర్శలు వచ్చాయి. ఇప్పటి కూటమి ప్రభుత్వం భూసేకరణ,సివిల్ పనులకు సంబంధించిన ఖర్చులను రాష్ట్ర వాటా కింద పరిగణించనున్నారు. ఇప్పటికే భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించిన మొత్తాన్ని కూడా రాష్ట్ర వాటాగా పరిగణనిస్తారు.
ఈ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర వాటా నిధులు రూ.100 కోట్లను అమలాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ)కు బదిలీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిధుల కేటాయింపుతో కోటిపల్లి-నరసాపూర్ రైల్వే లైన్ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ వాటాతో పనులు పట్టాలెక్కనున్నాయి.