యలమంచిలి: అక్టోబర్,7
(తెలుగు న్యూస్ పవర్.కామ్) స్థానిక మండల పరిషత్ అధ్యక్షుల అధికార బదలాయింపు సందర్భంగా ఏర్పడిన వివాదానికి సంబంధించి వైసీపీ నాయకులు బుధవారం నరసాపురం నాయి స్థానంలో హాజరయ్యారు. గత ఏడాది ఈ కేసుకు సంబంధించి 15 మంది వైసీపీ నాయకులపై ఎఫ్ఐఆర్ నమోదయింది. పోలీసుల విధి నిర్వహణకు ఆటంకం కలిగించారనే ఫిర్యాదు పై ఈ కేసు నమోదయింది. ఈ సందర్భంగా, వైసిపి రాష్ట్ర నాయకులు యడ్ల తాతాజీ మాట్లాడుతూ, అక్రమ కేసులు బనాయిస్తే, భయపడేది లేదని పేర్కొన్నారు. న్యాయ పోరాటానికి తామంతా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యలమంచిలి మండల వైసీపీ అధ్యక్షులు ఉచ్చుల స్టాలిన్ బాబు, పాలకొల్లు పట్టణ అధ్యక్షులు కోరాడ శ్రీనివాస్, వినుకొండ రవికుమార్, తదితరులు హాజరయ్యారు.
ఎంపీపీ అధికార బదలాయింపు వివాదంలో న్యాయస్థానానికి వెళ్లిన వైసీపీ నాయకులు.