
పాలకొల్లు:అక్టోబర్, 8(తెలుగు న్యూస్ పవర్. కామ్) పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో గురువారం ప్రదోషకాల సమయంలో నందీశ్వరునికి పంచామృతాభిషేకములు ఘనంగా నిర్వహించారు. నందీశ్వరునికి 19 మంది దంపతులు భక్తిశ్రద్ధలతో పూజలు జరిపారు. అభిషేక పండిట్ భమిడిపాటి వెంకన్న, మద్దూరు సూరిబాబు, ప్రధాన అర్చకులు కిష్టప్ప, ప్రధాన అర్చకులు అనిల్, అర్చకులు వీరబాబు, తదితరులు నందీశ్వరునికి పంచామృతాభిషేకములు, పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి రాపాక శ్రీనివాసరావు, ఛైర్మెన్ మీసాల రామచంద్రరావు,ఆలయ ధర్మకర్తలు కొండ్రెడ్డి సూరిబాబు, బాసిన సత్యనారాయణ, నాలం నాగ వెంకట సురేఖ, సూపరింటెండెంట్ పి. వాసు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.