Skip to main content

Telugu News Power

శ్రీ మావుళ్ళమ్మకు కలిదిండి దంపతుల గ్రా. 16 ల బంగారం కానుక.

శ్రీ మావుళ్ళమ్మ బంగారు కానుక సమర్పించిన కలిదిండి దంపతులను సత్కరిస్తున్న దృశ్యం
శ్రీ మావుళ్ళమ్మ బంగారు కానుక సమర్పించిన కలిదిండి దంపతులను సత్కరిస్తున్న దృశ్యం

భీమవరం:అక్టోబర్,12
(తెలుగు న్యూస్ పవర్.కామ్)
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారిని దేవి శరన్నవరాత్రులలో భాగంగా సోమవారం శ్రీ బాల త్రిపురసుందరి దేవి అలంకరణలో భక్తులకు అనుగ్రహ దర్శనం ఇచ్చారు. శ్రీ అమ్మవారి సంపూర్ణ స్వర్ణవస్త్రం ప్రాజెక్ట్ కి హైదరాబాద్ కి చెందిన కలిదిండి అజయ్ బాబు జమి వర్ధణి దంపతులు సుమారు రెండు లక్షల ఇరవై వేలు విలువైన 16 గ్రాముల బంగారం శ్రీ అమ్మవారికి సమర్పించారు.ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో వీరికి పూజ, ఆశీర్వచనం నిర్వహించారు.ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం ధర్మకర్తలు అతికెల ఆంజనేయ ప్రసాద్, గుసిడి నాగ శిరీష, కారెంపూడి ఆదిలక్ష్మి మిర్తిపాటి గున్నేశ్వరరావు ప్రసాదం, అమ్మవారి చిత్రపటం అందచేసారు.