Skip to main content

Telugu News Power

మత్స్యకారుల ఉపాధికి భరోసా. రూ.50 లక్షల విలువైన వృత్తి పరికరాల పంపిణీ.

లబ్ధిదారుని వాహనానికి లాంచనంగా తాళంచెవి అందజేస్తున్న ఎమ్మెల్యే నాయకర్, కేంద్ర మంత్రి వర్మ, కలెక్టర్ నాగరాణి, ఎస్బిఐ ప్రతినిధులు

నరసాపురం:అక్టోబర్,13
(తెలుగు న్యూస్ పవర్. కామ) స్థానిక, పెద్దమైనవానిలంక గ్రామంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సీఎస్‌ఆర్ నిధులతో రూ.50 లక్షల విలువైన 7 ఆటోలు, 12 మోపెడ్లు, 20 బోట్లు, వలలను 39 మంది మత్స్యకార లబ్ధిదారులకు మంగళవారం పంపిణీ చేశారు.
కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, స్థానిక ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మత్స్యకారుల జీవన ప్రమాణాలను మెరుగుపరచి, వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వాల లక్ష్యమని కూటమి నాయకులు పేర్కొన్నారు. అందించిన వాహనాలు, బోట్లు, వలలను సద్వినియోగం చేసుకొని ఉపాధి అవకాశాలను పెంపొందించుకోవాలని సూచించారు. నియోజకవర్గ ఇన్చార్జ్ పుత్తూరు రామరాజు, స్థానిక కూటమి నాయకులు, ప్రజలు ఈ కార్యక్రమంలో విశేషంగా పాల్గొన్నారు.