పాలకొల్లు: అక్టోబర్, 15
(తెలుగు న్యూస్ పవర్. కామ్) రాబోయే స్థానిక ఎన్నికలలో కూటమి అభ్యర్థులను రాష్ట్రవ్యాప్తంగా, ఏకగ్రీవంగా గెలిపించాలని పాలకొల్లు శాసనసభ్యులు, రాష్ట్ర జల వనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు పిలుపునిచ్చారు. మంత్రి తన క్యాంపు కార్యాలయంలో గురువారం పత్రిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజలకు మంచి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి, విశ్వాసంతో, అభిమానంతో ఓట్లు వేసి స్థానిక సంస్థలు ద్వారా మరింత అభివృద్ధి చేయడానికి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ప్రలోభాలకు లోను కాకుండా, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఓటు వేయాలని కోరారు. రెండు జిల్లాలకు ఇన్చార్జి మంత్రిగా, కూటమి సమన్వయ కమిటీ నేతగా, జలవనరుల శాఖ మంత్రిగా త్రిపాత్రాభినయం చేస్తూనే, స్థానిక శాసనసభ్యునిగా, క్షణం తీరిక లేకుండా నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నానని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వనికి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేయటానికి తాను చేసిన అభివృద్ధిని సవివరంగా వెల్లడించారు. నియోజకవర్గంలో ఈ రెండేళ్లలో 1245 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ప్రస్తుతం మరో 50 కోట్ల రూపాయలు నిధులు గుంజురైనట్టు తెలిపారు. ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రికి రూ. 52 కోట్ల నిధులతో కార్పొరేట్ స్థాయి వైద్యం పేదలకు అందించాలని సంకల్పించామన్నారు. టిడ్కో గృహ సముదాయం వద్ద రైతు బజారుకు రూ. 49.50 లక్షలు మంజూరైనట్టు తెలిపారు. స్థానిక పశువుల ఆసుపత్రి కి రూ. 1.60 కోట్లు, వెంకటాపురం, దొడ్డిపట్ల పసుల ఆసుపత్రులకు చెరో రూ.40 లక్షలు మంజూరు చేయించినట్లు తెలిపారు. శెట్టిబలిజ భవనానికి అదనంగా రూ.3 కోట్లు, వెళ్లి సంఘం భవనానికి కోటి రూపాయలు నిధులు మంజూరైనట్టు వివరించారు. పుష్కరాల సందర్భంగా, కంచుస్తంభంపాలెం నుంచి బాడవ వరకు 13 పుష్కర ఘాట్లకు, రూ. 14 కోట్ల రూపాయలు ఇప్పటికీ మంజూరు కాగా, ఆయా గ్రామాల్లో అభివృద్ధి పనులకు రూ. 9.30 ఓట్లు మంజూరైనట్టు వెల్లడించారు. ఏటిగట్టు పై బీటీ రోడ్డు వేసి లంక గ్రామాలతో అనుసంధానం చేస్తామన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా, అగ్రగామిగా, నిలపాలనే సంకల్పంతో అహోరాత్రులు పనిచేస్తున్నామని పేర్కొన్నారు. అభివృద్ధిని చూసి, ప్రజలకు మంచి చేస్తున్న ప్రభుత్వానికి అండగా, రాబోయే మూడేళ్లలో మరింత అభివృద్ధికి దూకపడే విధంగా స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో, పాముల రజిని కుమార్, మామిడిశెట్టి పెద్దిరాజు, గొట్టుముక్కల సూర్యనారాయణ రాజు, పెనుమత్స రామభద్ర రాజు, దాసరి రత్నం రాజు, భోజనం చినబాబు, చిలుకూరు బాలాజీ తులా రామలింగేశ్వర రావు, బోనం నాని, ఆరమిల్లి చిన్ని, మాతా రత్నం రాజు,తాళ్ళ నాగ రాజు, పీతల శ్రీనివాస్, జుత్తిగ రీతు తదితరులు పాల్గొన్నారు.
స్థానిక ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా కూటమి అభ్యర్థులను ఏకగ్రీవంగా గెలిపించాలి. అభివృద్ధికి సహకరించాలి. -మంత్రి నిమ్మల పిలుపు.
పత్రికా సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి నిమ్మల