పాలకొల్లు: అక్టోబర్,20(తెలుగు న్యూస్ పవర్. కామ్) పట్టణంలో వేంచేసియున్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో మంగళవారం, ఉదయం శ్రీ స్వామి వారు, అమ్మవార్లను, గుడివాడ సబ్ జడ్జి ఎస్ వాసుదేవ్ దంపతులు, పాలకొల్లు సబ్ జడ్జి జి. శ్రీనివాస రెడ్డి దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణాధికారి రాపాక శ్రీనివాసరావు, ఆలయ చైర్మన్ మీసాల రామచంద్ర రావు వారిని సాలువాతో సత్కరించి, స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేసారు. ఆలయ ప్రధాన అర్చకులు అనిల్ శర్మ వారికి వేద ఆశీర్వచన పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సూపర్నెంట్ వాసు పాల్గొన్నారు.
క్షీరా రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న న్యాయమూర్తులు.