Skip to main content

Telugu News Power

కూటమి జేడీ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థులు వీరే.

పాలకొల్లు: అక్టోబర్, 21
(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక బుధవారం కొలిక్కి వచ్చింది. స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జల వనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు, ఎడతెరిపి లేకుండా, సుదీర్ఘ చర్చోపచర్చలు అనంతరం, అందరికీ ఆమోదయోగ్యమైన సీట్ల పంపిణీ కార్యక్రమం బుధవారం ముగిసింది. తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమి క్షేత్రస్థాయి నుంచి శ్రేణుల అభిప్రాయాలను మంత్రి సేకరించినట్టు తెలిసింది. ఈ మేరకు సంతృప్తికరమైన పొత్తు ధర్మాన్ని పాటించారని కూటమి నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గం లో 3 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. రెండు స్థానాలు టిడిపి తీసుకుని, ఒక స్థానం జనసేనకు ఇచ్చింది. పాలకొల్లు జడ్పిటిసి అభ్యర్థిగా, మేడిది ఉషారాణి, పూడూరు మండల జడ్పిటిసి అభ్యర్థిగా, దాసరి మిస్సమ్మ టిడిపి అభ్యర్థులుగా బరిలో నిలిచారు.
యలమంచిలి జడ్పిటిసి స్థానం నుంచి జనసేన తరఫున కొడవటి నాగలక్ష్మి, పోటీకి దిగుతున్నారు.
వీరి కుటుంబాలకు సంబంధించి ఇంతకుముందు నుంచే రాజకీయ నేపథ్యం ఉంది.
నియోజకవర్గంలో ఉన్న 3 ఎంపీపీ స్థానాలను టిడిపి ఖాతాలో చేరాయి. అయితే, పోడూరు మండలం, అటు ఆచంట, ఇటు పాలకొల్లు నియోజకవర్గాల పరిధిలో ఉంది. మంత్రి నిమ్మల రామానాయుడు, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మధ్య అవగాహన మేరకు జడ్పిటిసి పాలకొల్లుకు ఇచ్చి, ఎంపీపీ పదవి ఆచంటకు ఇవ్వటానికి అవగాహన కుదిరిందని టిడిపి పార్టీ శ్రేణుల ద్వారా తెలిసింది. పాలకొల్లు ఎంపీపీ అభ్యర్థిగా అంగర వీరభద్ర కుమార్,
యలమంచిలి, మండల పరిషత్ అధ్యక్ష పదవి, ఎస్సీ (జనరల్) కు కేటాయించారు. ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు, పదవీ కాలాన్ని చేరి సగం చేసుకోవాలని అధినేత నిర్ణయించారని తెలిసింది. పెదలంక మాజీ సర్పంచ్, మేడపాడు, ఎస్సీ ఎంపీటీసీ స్థానం నుంచి పోటీలో ఉన్నారు. జిల్లా ఎస్సీ సెల్ నాయకులు, కాజ, (తూర్పుకు) చెందిన పీతల శ్రీనివాస్, ఎంపీపీ పదవి పంచుకోబోతున్నారు.