Skip to main content

Telugu News Power

Telugu News Power

జనసేన జెండా ఆవిష్కరణ.

పాలకొల్లు: మార్చి,14(తెలుగు న్యూస్ పవర్. కామ్) జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, స్థానిక డీలక్స్ సినిమా రోడ్ లో గల ఆంజనేయ స్వామి గుడి సమీపంలో జనసేన పార్టీ పతాకాన్ని స్థానిక క్షీరా రామలింగేశ్వర ఆలయ ధర్మకర్త పినిశెట్టి శ్రీనివాస్,చిన్ని ఆధ్వర్యంలో శనివారం ఆవిష్కరించారు. స్థానిక మారుతి సెంటర్, రామారావు పేట, గాంధీ బొమ్మల సెంటర్, సాయిబాబా గుడి రోడ్డు, టిట్కో కాలనీ, తదితర పలుచోట్ల పథకావిష్కరణ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు ఉత్సాహంగా…

Read More

వాట్సప్ ద్వారా పదవ తరగతి హాల్ టికెట్.

భీమవరం: మార్చి,14(తెలుగు న్యూస్ పవర్. కామ్) రానున్న పదవ తరగతి పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్ వాట్సాప్ ద్వారా పొందటానికి విద్యాశాఖ ఏర్పాటు చేసింది. విద్యార్థులు ఫోన్లో వాట్స్అప్ ఓపెన్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ, వాట్సప్ పాలన నెంబర్ 95523 00009 ను, కాంటాక్ట్ నంబర్లలో సేవ్ చేయాలి. ఈ నెంబర్ కు హాయ్ సందేశం పంపాలి. వచ్చే మెను లో విద్యా సేవలు ఆప్షన్ ను ఎంపికను చేయండి. అక్కడ ఎస్ఎస్సి మార్చి, 2026 హాల్…

Read More

పలాసలో కేంద్రియ విద్యాలయ

న్యూఢిల్లీ: మార్చి, 14(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఉత్తరాంధ్రకు వరంగా, పలాసలో కేంద్రీయ విద్యాలయం ప్రారంభించనున్నట్టు కేంద్ర పౌర విమానయాన శాఖామాత్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు శనివారం వెల్లడించారు. విద్యా సంవత్సరం(2026–27) నుంచి తరగతులు ప్రారంభిస్తారు. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు కూడా విడుదలయ్యాయి. శ్రీకాకుళం ప్రాంతానికి ఎంతో ముఖ్యమైన ఈ విద్యాసంస్థను ఆమోదించి,ప్రారంభానికి సహకరించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కృతజ్ఞతలు…

Read More

పశ్చిమగోదావరి జిల్లా గ్యాస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు.

భీమవరం: మార్చి, 14 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న, వంట గ్యాస్ సమస్య పరిష్కారానికి పశ్చిమగోదావరి జిల్లా అధికారులు పరిష్కారం సూచించారు. వినియోగదారులు ఎవరైనా వంటగ్యాస్ పొందటానికి ఇబ్బందులు పడుతుంటే, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావడానికి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. గ్యాస్ సమస్య ఎదురైనప్పుడు,8121676653 ఈ టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేస్తే, సివిల్ సప్లై అధికారులు వెంటనే స్పందించి,సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు. ప్రస్తుత పరిస్థితిని ఆసరాగా…

Read More

ఎంఎంకె ఉన్నత పాఠశాల ఆకస్మిక తనిఖీ

పాలకొల్లు: మార్చి, 14(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనురల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు స్థానిక ఎం ఎం కే ఎన్ ఎం ఉన్నత పాఠశాల ఆకస్మికముగా తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ, మధ్యాహ్నం భోజన పథకం అమలు తీరును పరిశీలించారు. విద్యార్థులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి లోకేష్, విచారణ అభివృద్ధికి విప్లవాత్మకమైన మార్పులు తీసుకువ స్తున్నారని వెల్లడించారు. నాణ్యమైన విద్య విద్యార్థులకు అందుబాటులోకి…

Read More

ప్రపంచంలోనే గొప్ప సాంస్కృతిక సాంప్రదాయం ఇఫ్తార్ విందు. -మంత్రి నిమ్మల

పాలకొల్లు:మార్చి,14(తెలుగున్యూస్ పవర్.కామ్)ప్రపంచంలోనే ఒక గొప్ప సామాజిక సాంస్కృతిక సాంప్ర దాయం ఇఫ్తార్ విందు అని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. స్థానిక పెద్ద మసీదు లో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా శనివారం ముస్లిం సోదరులకు, ధర్మారావు ఫౌండేషన్ వారు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ,అత్యంత పవిత్రమైన రంజాన్ మాసం ఎంతో చైతన్యవంతమైన స్ఫూర్తిని కలిగిస్తుందన్నారు. ధనిక, పేద అనే భేదం…

Read More

జనసేనకు, లోకేష్ లక్ష విరాళం.

మచిలీపట్నం: మార్చి, 14(తెలుగు న్యూస్ పవర్. కామ్) జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, ఎన్నారై జనసైనికుడు లోకేష్, జనసేన పార్టీకి లక్ష రూపాయలు విరాళం ఇచ్చారు.ఈ మొత్తాన్ని, పెద్దిరెడ్డి వనజ, పార్టీ కార్యాలయంలో అందజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ఆశయాల పట్ల, అచంచలమైన విశ్వాసంతో ఈ విరాళం అందజేస్తున్నట్లు జర్మనీలో ఉంటున్న లోకేష్ తెలిపారు. పార్టీపట్ల అభిమానంతో భూరివిరాళం అందజేసిన లోకేష్ ను జనసైనికులు అభినందించారు.

Read More

జాతీయ తెలుగు సదస్సు గోడ పత్రిక ఆవిష్కరణ.

పాలకొల్లు: మార్చి, 14(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ (స్వయం ప్రతిపత్తి) కళాశాలలో ఈ నెల 24న తెలుగు విభాగం ఆధ్వర్యంలో తెలుగు “సాహిత్యం -మహిళా చైతన్యం” అనే అంశం పై జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా తిరువీధులరాజరాజేశ్వరి తెలియజేశారు. కళాశాలలో ఈ సదస్సు గోడపత్రికను ఆవిష్కరించారు. తెలుగు శాఖాధ్యక్షులు డాక్టర్ బూసి వెంకటస్వామి సదస్సు సమన్వయకర్తగా,సహా సమన్వయకర్తగా జువాలజీ శాఖాధిపతి డాక్టర్ ఎం రామకృష్ణ,సదస్సు ఆర్గనైజింగ్ సెక్రటరీగా కళాశాల…

Read More

శ్రీ ఏ.ఎస్‌.ఎన్‌.ఎం ప్రభుత్వ కళాశాల, పాలకొల్లులో ఉద్యోగమేళ.

పాలకొల్లు: మార్చి,14(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ ఏ.ఎస్‌.ఎన్‌.ఎం ప్రభుత్వ కళాశాల (స్వయంప్రతిపత్తి), పాలకొల్లు లో ఈనెల 16 న ప్లేస్‌మెంట్ సెల్ మరియు జవహర్ నాలెడ్జ్ సెంటర్ (జే కే సి) ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. టి. రాజా రాజేశ్వరి తెలిపారు. ఈ జాబ్ మేళాలో పలు ప్రముఖ సంస్థలు సన్రైజ్ వర్క్ ఫోర్స్, డయాకిన్, టాటా ఎలక్ట్రానిక్స్, క్యాప్సిటన్ సర్వీసెస్ లిమిటెడ్, హీరో, ఇండో సోలార్, అపోలో…

Read More

ఏపీ హైకోర్టు న్యాయమూర్తి గా జస్టిస్ లిసా గిల్.

అమరావతి: మార్చి, 13(తెలుగు న్యూస్ పవర్.కామ్) భారత న్యాయ వ్యవస్థలో మహిళలు కూడా కీలక స్థానాలు సంపాదిస్తూ ముందుకు సాగుతున్న ఉదాహరణల్లో ఒకరు లీసా గిల్ ఒకరు. ఆమె శుక్రవారం ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు అమూర్తగా బాధ్యతలు స్వీకరించారు. న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించడం దేశవ్యాప్తంగా ప్రాధాన్యం పొందింది. జస్టిస్ లిసా గిల్ 1966 నవంబర్ 17న చండీగఢ్‌లో జన్మించారు. ఆమె ప్రాథమిక విద్యను చండీగఢ్‌లోని కార్మెల్ కాన్వెంట్ పాఠశాలలో పూర్తి చేశారు. తరువాత ఆమె పంజాబ్ యూనివర్సిటీ…

Read More