Skip to main content

Telugu News Power

Telugu News Power

విద్యార్థికి రోటరీ క్లబ్ సాయం

పాలకొల్లు డిసెంబర్ 15 తెలుగు న్యూస్ పవర్ స్థానిక రోటరీ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ కోసూరి రామకృష్ణ ఆనంద రాజు, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థికి ఆర్థిక సహాయం అందించారు. పెదమామిడిపల్లి కి చెందిన కుక్కల యామిని సత్యలక్ష్మి ఓ ప్రైవేటు కాలేజీకి చెల్లించవలసిన ఫీజు 7500 రూపాయలు ఉపకార వేతనం గా అందించారు. ప్రతిభ ఉన్న పేద విద్యార్థుల చదువు కొనసాగించడానికి రోటరీ క్లబ్ సభ్యులు సహాయపడతారని రాజు తెలిపారు. ఈ కార్యక్రమం క్లబ్ మాజీ…

Read More

ఏపీ మంత్రుల పనితీరు ర్యాంకింగ్స్ విడుదల

93%తో అగ్రస్థానంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న మంత్రుల పనితీరుపై తాజాగా విడుదలైన ర్యాంకింగ్స్ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతున్నాయి. ప్రజాభిప్రాయం, శాఖల పనితీరు, పాలనలో చురుకుదనం వంటి అంశాల ఆధారంగా ఈ జాబితాను రూపొందించినట్లు సమాచారం. ఈ ర్యాంకింగ్స్‌లో ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ 93 శాతం పనితీరు స్కోర్‌తో తొలి స్థానంలో నిలిచారు. ఆయన తర్వాత ఎన్. రామా నాయుడు (87%), సత్య కుమార్ యాదవ్ (86%) వరుసగా రెండో,…

Read More

యు టి ఎఫ్ యలమంచిలి మండల శాఖ వైద్య శిబిరం.

పాలకొల్లు డిసెంబర్ 14 తెలుగు న్యూస్ పవర్ యుటిఎఫ్ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్సీ షేక్ షాబ్జి ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఎలమంచిలి మండల యూటీఎఫ్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా షాబ్జి ఉద్యమాల్లో ప్రదర్శించిన ధైర్య సాహసాలను, సేవా భావాన్ని పలువురు యుటిఎఫ్ నాయకులు కొనియాడారు. ఈ శిబిరాన్ని ప్రముఖ వైద్యులు డాక్టర్ త్సవటపల్లి సత్యనారాయణమూర్తి, బాబ్జి, శ్రీ వైష్ణవి హై స్కూల్ లో ప్రారంభించారు. ఈ శిబిరంలో చక్కెర…

Read More

పంచాయతీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన

పాలకొల్లు:డిసెంబర్,14 (తెలుగు న్యూస్ పవర్) రాష్ట్ర జలవనరుల శాఖమాత్యులు, స్థానిక శాసనసభ్యులు రామానాయుడు వడ్లవానిపాలెం గ్రామంలో 32 లక్షల ఆర్ జి ఎస్ ఏ నిధులతో చేపట్టనున్న పంచాయితీ భవన నిర్మాణ పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు. స్థానిక పెచ్చెట్టిపాలెం లో 15 లక్షల ఓ ఎన్ జి సి నిధులతో స్మశానవాటిక అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు ఉన్నమట్ల కపర్ది, జనసేన నాయకులు తులా రామలింగేశ్వర…

Read More

అంగన్వాడీ సమస్యల పరిష్కారం కోసం స్మార్ట్ ఫోన్ – మంత్రి నిమ్మల

పాలకొల్లు:డిసెంబర్,14 (తెలుగు న్యూస్ పవర్) రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీల సమస్యలు పరిష్కారం కోసం స్మార్ట్ ఫోన్లు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ పంపిణీ చేస్తుందని మంత్రి నిమ్మల వెల్లడించారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో మంత్రి సోమవారం 224 మంది అంగన్వాడీలకు 5జి స్మార్ట్ ఫోన్ అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంగన్వాడీలు ఎదుర్కొంటున్న చాలా సమస్యలకు 5జి ఫోన్ పరిష్కారం చూపుతుందన్నారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి తను ఏ అవకాశం వచ్చిన తప్పక ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు….

Read More

ప్రజల భద్రతే కూటమి ప్రభుత్వ లక్ష్యం

యలమంచిలి: డిసెంబర్,14(తెలుగు న్యూస్ పవర్) అభివృద్దే,ధ్యేయంగా, సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నది, కూటమి ప్రభుత్వమని, స్థానిక శాసన సభ్యులు,రాష్ట్ర జల వనరుల శాఖామాత్యులు, నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఏటిగట్టు పటిష్ట పరిచే పనుల శంకుస్థాపన కార్యక్రమంలో చించినాడ వద్ద మంత్రి నిమ్మల శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూనియోజకవర్గంలో దాదాపు 20 కిలోమీటర్ల మేర గోదావరి ఏటిగట్లు పటిష్టత కోసం గతంలో 8 కోట్ల, రూపాయల నిధులు మంజూరు చేయించామని, ప్రస్తుతం దాదాపు మరో 9 కోట్లు…

Read More

కొబ్బరి రైతుకు ఊరట.

    పాలకొల్లు:డిసెంబర్,13 (తెలుగు న్యూస్ పవర్ ) కొబ్బరి ధర 25- 26 రూపాయల నుంచి ఒక్కసారిగా, సగానికి పైగా పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రానున్న 2026 ఏడాదికి గాను కొబ్బరికి మద్దతు ధర ప్రకటించింది. మిల్లింగ్ కోప్రా ధర 12,027 రూపాయలు. గతంలో ఈ ధర 11, 5 82 రూపాయలు ఉండేది. ఈ ఏడాది పెరుగుదల క్వింటాల్ కు 445 రూపాయలు. బాల్ కోప్రా ధర…

Read More

అద్భుత జ్ఞాపకం, ఏ ఎస్ ఎన్ ఎం అమేజింగ్ రీయూనియన్

  భీమవరం:డిసెంబర్,13 (తెలుగు న్యూస్ పవర్) పలకరింపులు, కౌగిలింతలు, నవ్వులు, కేరింతలు, తుళ్ళింతలతో ఉప్పొంగిన ఆత్మీయ హృదయ సమ్మేళన అపురూప దృశ్యం ఆవిష్కృతం అయ్యింది. అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాల పూర్వ విద్యార్థుల కలయిక.భీమవరం(జక్కరం)లోని ఓ ఫామ్ హౌస్ లో శనివారం జరిగిన సందర్భంగా ఈ అద్భుత ఘట్టం చోటు చేసుకుంది. ఈ కాలేజీలో 1979 నుంచి 1982 వరకు చదువుకున్న పూర్వ విద్యార్థులు తమ జ్ఞాపకాలు ఇక్కడ పంచుకున్నారు. బిజీ లైఫ్ నుంచి బ్రేక్ ఇచ్చి,…

Read More

బిజెపి జిల్లా అధ్యక్షులు శ్రీదేవికి పుట్టినరోజు శుభాకాంక్షలు

తణుకు, డిసెంబర్,12(తెలుగు న్యూస్ పవర్) పశ్చిమగోదావరి జిల్లా తొలి బిజెపి మహిళ అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి పుట్టినరోజు సందర్భంగా వేల్పూరు లో బిజెపి రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి ఉన్నమట్ల కపర్ధి బొకే తో సత్కరించి జన్మ దిన శుభాకాంక్షలు తెలియజేశారు. బిజెపి మహిళా మోర్చా అధ్యక్షులు అల్లూరు పద్మ వర్మ, ఎర్రంశెట్టి పద్మారావు శాలువ తో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశా.ఈ సందర్భంగా శ్రీదేవి మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవితో…

Read More

చాంబర్స్ కాలేజీ విద్యార్థులకు ఉద్యోగాలు.

పాలకొల్లు: డిసెంబర్,12(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ఛాంబర్స్ కళాశాలలో చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ప్రాంగణ ఎంపికలు జరిగాయి. నిర్మాణ్ సంస్థ ఆధ్వర్యంలో పలు కంపెనీలు తమకు కావలసిన ఉద్యోగులను వివిధ పరీక్షల ద్వారా ఎంపిక చేసుకున్నాయి. దాదాపు 214 మంది ఆఫర్ లెటర్లు సీఈఓ సందీప్ చేతుల మీదుగా అందుకున్నారు. వీరికి 20 వేల రూపాయల నెలవారి వేతనం ప్రకటించారు. టి సి ఎల్, ఎం ఆర్ ఎఫ్, యోమా, బజ్ వర్క్స్, ముత్తూట్ ఫిన్…

Read More